BREAKING
పామూరు భవిష్యత్తు కోసం కప్పు సాసర్‌కు ఓటేయండి జమ్మూ కాశ్మీర్‌లో 65 మంది విదేశీ ఉగ్రవాదుల సంచారం.. షేక్ హసీనా స్వదేశానికి తిరిగొస్తే అది అప్పగింత అభ్యర్థనకు వేరు:భారత్ స్పష్టీకరణ.. జర్మనీలో సహజ వాయువు నిల్వల పెంపునకు యూనిపర్ రూ. 1,100 కోట్ల పెట్టుబడి: ఎయిర్ ఇండియా–ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కార్యకలాపాల్లో భారీ మార్పులు: డాయిష్ బ్యాంక్–పంజాబ్ నేషనల్ బ్యాంక్ కీలక ఒప్పందం: జర్మనీ రక్షణ సంస్థ హెల్సింగ్ భారీ కొనుగోలుకు సిద్ధం: స్పెయిన్ రక్షణ సంస్థ ఇండ్రా భారీ లక్ష్యం.. 2030 నాటికి 12 బిలియన్ యూరోల ఆదాయం: అమెరికా, చైనాకు పోటీగా యూరప్ భారీ సాంకేతిక పెట్టుబడి నిధి : గూగుల్‌పై మలేషియా ప్రభుత్వం రూ. 1,300 కోట్ల దావా: నేటి రాశి ఫలాలు 26 నవంబర్, 2026 నేటి పంచాంగం26 నవంబర్, 2026 అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలి కోటి దీపోత్సవంలో పాల్గొన్న జగన్నాధుల మణిదీప్ శర్మ అభివృద్ధిపై చర్చకు సిద్ధం

టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ విడుదల

Select Suryaa Now
టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ విడుదల

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'టాక్సిక్: ఎ ఫెయిరీ టెల్ ఫర్ గ్రోన్-అప్స్' చిత్రానికి సంబంధించి మేకర్స్ ఒక క్రేజీ అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇంగ్లీష్ వెర్షన్‌ను ఇండియా వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.  అసలు ఈ చిత్ర కథాంశాన్ని రూపొందించిన సమయంలోనే కన్నడతో పాటు ఇంగ్లీష్ భాషలోనూ ప్రధానంగా షూటింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, ఇండియన్ లాంగ్వేజ్ వెర్షన్‌తో పోలిస్తే ఈ ఇంగ్లీష్ ఎడిషన్‌ను దాదాపు 17 నిమిషాల పాటు ట్రిమ్ చేసి మరింత క్రిస్ప్‌గా, ఫాస్ట్ పేస్‌తో కూడిన షార్టర్ కట్‌గా (2 గంటల 57 నిమిషాల నిడివితో) థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు.  యశ్ నటన, గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్ సీక్వెన్స్‌లతో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాను థియేటర్లలో సరికొత్త కోణంలో ఆస్వాదಿಸಲು ఇంగ్లీష్ వెర్షన్ చక్కటి అనుభూతిని పంచనుంది. ఈ సరికొత్త రన్‌టైమ్ కట్‌తో వస్తున్న ఇంగ్లీష్ వెర్షన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.