BREAKING
భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు సౌదీలో చికిత్స 'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన

యువత భవితకు భరోసా

Select Suryaa Now
యువత భవితకు భరోసా


* శ్రీ లెండి కళాశాలలో విద్యార్థులతో ముచ్చటించిన
- ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

భోగాపురం, సెప్టెంబర్ 29, (మేజర్ న్యూస్):

భోగాపురం మండల కేంద్రంలో ఉన్న శ్రీ లెండి డిగ్రీ కళాశాలలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న *“యువత భవితకు భరోసా కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల టీడీపీ ఇంచార్జి కర్రోతు బంగార్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి అప్పలనాయుడు మాట్లాడుతూ యువతకు విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. యువత తమ ప్రతిభను మెరుగుపరుచుకుని అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. యువతకు మెరుగైన అవకాశాలు కల్పించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే ప్రభుత్వ లక్ష్యమని,ప్రభుత్వం చేస్తున్న వివిధ కార్యక్రమాలను పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కిరణ్ కుమార్, అధ్యాపకు సిబ్బంది పాల్గొన్నారు.