BREAKING
రీజనల్ సమ్మిట్ ఎగ్జిబిషన్‌ను సందర్శించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభివృద్ధి పనులు, తాగునీటి సమస్యలపై మంత్రి నారాయణతో సమావేశం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పత్తి కొనుగోళ్లకు రంగం సిద్ధం చేయాలి.... జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అంగన్వాడి సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలి......... ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మ జా మా ఊరు దారిని మేము కాపాడుకుంటాం పొదలాడ ప్రజలు రాస్త రోకో క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి ఎస్పీ జగదీష్‌ ఆదహళ్లి ఓటీటీలోనూ అదరగొడుతున్న బెత్లెహమ్ కుటుంబ యూనిట్.. ఏకంగా 5.4 మిలియన్ల వ్యూస్‌తో సరికొత్త రికార్డ్! అభివృద్ధి అవకాశాలను వెలుగులోకి తేవడమే ప్రాంతీయ సదస్సుల లక్ష్యం : రాష్ట్ర పరిశ్ర‌మ‌ల శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఎన్. యువ‌రాజ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి విశాఖను తూర్పు తీర ఆర్థిక ముఖద్వారంగా అభివృద్ధి చేస్తాం మోదీ గారి 25 ఏళ్ల పాలనా ప్రస్థానం భారత రాజకీయాల్లో నవశకం: ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్స్ పరిశీలన కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు కొత్త ఊపు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది టీచర్లే విశాఖ బీచ్‌లో విషాదం....ప్రాణాలు కోల్పోయిన నిజామాబాద్ యువకుడు.

విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

Select Suryaa Now
విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

రేపల్లె, మేజర్ న్యూస్; రేపల్లె మండలం పెనుమూడి గ్రామ పరిధిలోని రొయ్యల చెరువుల వద్ద విద్యుత్ షాక్‌కు గురై చెరుకూరి లక్ష్మీకాంత్ (35) అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం జరిగిన ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రొయ్యల చెరువుల వద్ద మంచినీరు సరఫరా చేసేందుకు వెళ్లిన లక్ష్మీకాంత్ కు విద్యుత్ సరఫరా ఒక్కసారిగా షాక్ ఇవ్వడంతో లక్ష్మీకాంత్ కుప్పకూలినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. వృద్ధులైన తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటున్న సమయంలో లక్ష్మీకాంత్ దుర్మరణం చెందడం బాధాకరమని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న యువకుడు అకాల మరణం చెందడంతో వారి రోదనలు మిన్నంటాయి.
సమాచారం అందుకున్న రేపల్లె పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.