BREAKING
ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్రఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ ఈక్విటీల వైపు మళ్లీ క్యూ కడుతున్న విదేశీ పెట్టుబడులు పైడితల్లి అమ్మవారి పండగకు చిన్న శ్రీను, వారి కుమార్తె సిరమ్మ ను ఆహ్వానించిన పూజారులు ఎంఏఎం కళాశాలల్లో ఘనంగా ఫ్రెషర్స్‌ డే వేడుకలు సెప్టెంబర్‌లో దూసుకెళ్లిన టెస్లా చైనా ఈవీ విక్రయాలు తెలంగాణ మోడల్ స్కూల్‌లో ముందస్తుగా ఘనంగా బతుకమ్మ వేడుకలు. ఆలయాల్లో అభివృద్ధి వెలుగులు నింపుతున్న ఆనం రామనారాయణరెడ్డి! నగరాభివృద్ధికి టీటీడీ 200 కోట్లు విడుదల -జేఈఓకు టిటిడి చైర్మన్, వైస్ చైర్మన్ కృతజ్ఞతలు అమెరికాలో భారీగా మిగిలిన మొక్కజొన్న నిల్వలు స్థానిక ఎన్నికల్లో బీసీలు టీడీపీకి తగిన బుద్ధి చెప్పాలి అరకు పార్లమెంట్ ఎన్నికల కమిటీలో జనసేన ఐటీ కోఆర్డినేటర్ పైల సత్యన్నారాయణకు చోటు ఎగుమతిదారులకు కస్టమ్స్ పథకాలపై అవగాహన కార్యక్రమం హైదరాబాద్లో ఫియో, ఐసీఐసీఐ బ్యాంక్ సంయుక్త నిర్వహణ ఉద్యోగ నివేదికల వెలువడే వేళ లాభాల బాటలో టీఎస్‌ఎక్స్ ఫ్యూచర్స్, పెరుగుతున్న బంగారం ధరలు బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి బుచ్చి సి హెచ్ సి కి 39 లక్షల వైద్య పరికరాలు అందజేత

విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

Select Suryaa Now
విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

విజయనగరం అక్టోబర్ 9మేజర్ న్యూస్

విద్యుత్ కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ AECEA G-3045 రాష్ట్ర కమిటీ నాయకులు గురువారం విద్యుత్ సౌధలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (HR & Admin) జి. సూర్య ప్రవీణ్ చంద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు అని . కార్మికుల సమస్యలపై సుమారు 20 నిమిషాల పాటు చర్చించిన JMD, ఆయా అంశాలను పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు రాష్ట్ర కమిటీ నాయకులు తెలిపారు.అని విజయనగరం జిల్లా   G-3045 యూనియన్ జిల్లా అధ్యక్షులు బి. గోవిందరావు తెలిపారు 

 ప్రధానంగా చర్చించిన అంశాలు

EPF పరిమితి పెంపుపై వినతి:** EPF పరిమితిని రూ.25,000కు పెంచే అంశాన్ని JMD దృష్టికి తీసుకెళ్లారు అని . దీనిపై త్వరలో ఉత్తర్వులు జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన అంగీకరించినట్లు కమిటీ తెలిపింది అన్నారు . ఈ మార్పుతో ఉద్యోగుల EPF పొదుపులు, పెన్షన్ ప్రయోజనాలు పెరగడంతో పాటు EDLI పథకం కింద లభించే బీమా ప్రయోజనాలు కూడా పెరిగే అవకాశం ఉందని వివరించారు.

హైలీ స్కిల్డ్ కార్మికులకు వైద్య సదుపాయాలు: హైలీ స్కిల్డ్ కార్మికులకు ESI వర్తింపజేసేలా వేతనాలను పునర్వ్యవస్థీకరించి, సంబంధిత ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు స్టేట్ కమిటీ కోరింది అని . ఇందుకు సంబంధించిన పత్రాలు, ఆధారాలను JMDకు సమర్పించారు అని గోవిందరావు తెలిపారు . ఈ విధానం సాధ్యం కానిపక్షంలో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వైద్య సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.అని అలాగే 

SBI కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ: కాంట్రాక్టర్ ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్న విద్యుత్ కార్మికులకు SBI కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ ఖాతాలు అందుబాటులోకి తీసుకురావడానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు అన్నారు . దీనివల్ల బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా జీతం ఆధారిత అదనపు ప్రమాద బీమా ప్రయోజనాలు లభించే అవకాశం ఉంటుందని తెలిపారు.

కారుణ్య నియామకాల పరిష్కారం: ఖాళీలు ఉన్నప్పటికీ కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న కుటుంబాలకు సంబంధించిన పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించాలని స్టేట్ కమిటీ కోరింది అన్నారు . దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను వన్‌టైమ్ సెటిల్మెంట్ విధానంలో పరిష్కరించాలని కూడా విజ్ఞప్తి చేశారు.అని 

పదవీ విరమణ కార్మికుల సమస్యలు: పదవీ విరమణకు చేరువలో ఉన్న కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జె ఎం డి దృష్టికి తీసుకెళ్లారు.అన్నారు ఈ సమస్యల పరిష్కారానికి యూనియన్ తరఫున ప్రతిపాదనను యాజమాన్యానికి సమర్పించగా, త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపినట్లు కమిటీ పేర్కొంది అని తెలిపారు .

వన్‌టైమ్ మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్:కార్మికులకు జిల్లా నుంచి జిల్లాకు, జోన్ నుంచి జోన్‌కు ఒకసారి పరస్పర బదిలీ అవకాశం కల్పించాలని కోరారు. దీనిపై త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని JMD తెలిపినట్లు నాయకులు వెల్లడించారు.

కార్మికుల సమస్యలను ఓపికగా విని, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన జె ఎం డి జి. సూర్య ప్రవీణ్ చంద్‌కు, విద్యుత్ యాజమాన్యానికి ఏ  ఈ సి ఈ ఏ G-3045 రాష్ట్ర కమిటీ నాయకులు తో పాటు విజయనగరం జిల్లా కాంట్రాక్టు కార్మికులు తరుపున కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నమ్మన్నారు 

విజయవాడ లో జరిగిన ఏఈ సమావేశంలో AECEA G-3045 రాష్ట్ర అధ్యక్షుడు పి. కాశీ మధుబాబు, వివిధ జిల్లాలకు చెందిన కార్మిక నాయకులు పాల్గొన్నారు.అని గోవిందరావు తెలిపారు సమస్య లు పరిష్కారం కోసం స్టేట్ కమిటీ పిలుపు మేరకు సమ్మె కు కూడా జిల్లా కార్మికులు సిద్ధంగా వున్నారు అని అన్నారు