విద్యార్థులతో ట్రేస్ ఇండియా, టుగెదర్ ఇండియా సంస్థల సమావేశం
ఏలూరు, మేజర్ న్యూస్: ట్రేస్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ , టుగెదర్ ఇండియా ఆధ్వర్యంలో శుక్రవారం ఆదిత్య డిగ్రీ కాలేజీలో విద్యార్థులతో టుగెదర్ ఇండియా ప్రెసిడెంట్ మిస్టర్ సిగ్వి, వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ మాన్యల్ ట్రేస్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్, సీనియర్ లయన్ దిడ్ల అంజిలో, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ వంగ వెంకటేశ్వర ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏలూరు స్మార్ట్ సిటీ లైన్స్ క్లబ్, పూర్వపు అధ్యక్షులు, షేక్ ముస్తఫాలీ, ట్రెజరర్ జి జె ఏ స్టీవెన్, సీనియర్ లయన్ కృష్ణారావు, సీనియర్ లయన్ కందుల ఆదినారాయణ రావు తదితరులు పాల్గొన్నారుఈ సందర్భంగా స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన మిస్టర్ సిగ్వి, మిస్టర్ ఇమ్మానియేల్ లను ఆదిత్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ వంగా వెంకటేశ్వరరావు ఘనంగా సన్మానించి కాలేజీ షీల్డ్ అందజేశారు.