వెల్దుర్తిలో SWPC సందర్శన: వర్మీ కంపోస్ట్, బిన్ బ్యాగ్ విధానాలపై ఎమ్‌పిడిఒ అవగాహన
వెల్దుర్తి: సూర్య మేజర్ న్యూస్ గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణతో పాటు చెత్త నుంచి ఆదాయం పొందే మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని వెల్దుర్తి ఎమ్‌పిడిఒ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని (SWPC) సందర్శించిన ఆయన, వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీ, 'బిన్ బ్యాగ్' సేకరణ విధానాలను క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.ఈ సందర్భంగా ఎమ్‌పిడిఒ మాట్లాడుతూ... తడి చెత్తతో నాణ్యమైన సేంద్రీయ ఎరువును తయారు చేయడం ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూరడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. ఇళ్ల వద్దనే తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు 'బిన్ బ్యాగ్' విధానం ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. ప్రజలందరూ రోడ్లపై చెత్త వేయకుండా పంచాయతీకి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
సూర్య ప్రతినిధి షేక్ దస్తగిరి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం