వలపర్ల Z.P.H.S. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం – 2000–2001 బ్యాచ్
మార్టూరు, మేజర్ న్యూస్:
చిన్ననాటి స్నేహాలు… తరగతి గది జ్ఞాపకాలు… గురువుల బోధనలు… ఎన్నో మధురానుభూతులను మరోసారి గుర్తుచేసుకుంటూ వలపర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2000–2001 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
ఏళ్ల తరబడి దూరంగా ఉన్న స్నేహితులంతా ఒకే వేదికపై కలుసుకుని, పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను స్మరించుకుంటూ ఆనందంగా గడిపేందుకు ఈ సమ్మేళనం ఒక చక్కని వేదిక కానుంది.
నాడు ఒకే తరగతి గది… నేడు విభిన్న రంగాల్లో ప్రస్థానం… కానీ చెరిగిపోని స్నేహబంధం!