BREAKING
వైజాగ్ మెట్రో, బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు కేంద్ర ఆమోదం తెలపండి: ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయనున్న సీఎం చంద్రబాబు! చిల్లకూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి ధార్మిక సమితులు నిరంతరం నిర్వహించాలి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు చివరి అవకాశం పేకాట వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే విమర్శలు అగ్ని ప్రమాదంలో రూ.2 లక్షల ఆస్తి నష్టం రైతుల ట్రాన్స్ఫర్మర్లే టార్గెట్. ఇద్దరు దొంగలు అరెస్ట్. కంటి చూపును ఎప్పటికీ పదిలంగా ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవే.. రోజువారీ ఆహారంలో కచ్చితంగా ఉండాల్సిందే! ముక్కిడి దేవత గుడికి రేకులు షెడ్డు కు వితరణ ప్రధాని మోదీ పాతికేళ్ల పాలనపై ఏపీ కేబినెట్ ప్రశంసల తీర్మానం. పారిజాతగిరి ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు ఏపీ సేవ చలనాలు చెల్లించాలీ దళిత మహిళకు న్యాయం చేయండి.. ఆత్మకూరు డీఎస్పీకి కొప్పాల రఘు వినతి వరి పంట పొలాలను క్షేత్రస్థాయి పరిశీలన చేసిన జాయింట్ కలెక్టర్ ఎర్రకాలువ మిగులు భూముల్లో పేదలకు పట్టాలు ఇవ్వాలివ్యకాసం డిమాండ్

వైసీపీని వీడి టీడీపీలో చేరిన 25 కుటుంబాలు

Select Suryaa Now
వైసీపీని వీడి టీడీపీలో చేరిన 25 కుటుంబాలు

• మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్న కుటుంబాలు.

• వైసీపీ ఎంపీటీసీ పానెం శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ యద్దనపూడి చింపిరయ్య ఆధ్వర్యంలో చేరికలు

కొరిశపాడు, మేజర్ న్యూస్ : 

కొరిశపాడు మండలంలోని తమ్మవరం గ్రామానికి చెందిన 25 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. సంతమాగులూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.

వైసీపీ ఎంపీటీసీ పానెం శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ యద్దనపూడి చింపిరయ్య ఆధ్వర్యంలో 25 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు మంత్రి గొట్టిపాటి రవికుమార్ నాయకత్వంలో అద్దంకి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు. పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కరిచేటి రాంబాబు, రామిరెడ్డి ఆంజనేయులు (ఎం.కాం) తదితరులు పాల్గొన్నారు.