త్వరితగతిన కొమ్మది టిడ్కో గృహాలకు రోడ్లు పనులు ప్రారంభం.
గంటా శ్రీనివాసరావు ఆదేశాలతో అభివృద్ధిలో దూసుకుపోతున్న ఆరో వార్డు.....
రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించిన చిక్కాల విజయబాబు....
పిఎం పాలెం సెప్టెంబర్ 29 మేజర్ న్యూస్....జివిఎంసి ఆరో వార్డు పరిధి కొమ్మది విలేజీ సమీపంలో ఉన్న టిడ్కో గృహాల వద్ద మంగళవారం నాడు రోడ్డు పనులను వార్డు అధ్యక్షుడు గరే గురునాథ్ అధ్యక్షతన భీమిలి నియోజకవర్గం ఇంచార్జి చిక్కాల విజయబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న సోమవారం నాడు గంటా శ్రీనివాసరావు కొమ్మది టిడ్కో గృహాలను పరిశీలించి తక్షణమే మౌలిక సదుపాయాలను కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే.ఇందులో భాగంగా ఆయన ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం రోడ్లు వేసేందుకు 70 లక్షలు రూపాయలు నిధులు మంజూరు చేసి త్వరితగతిన రోడ్డు పనులను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశాలతో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేపడుతూ నియోజకవర్గం మొత్తం అభివృద్ధి బాటలో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఏ ప్రజాప్రతినిధులు కూడా పర్యటించిన గంటల వ్యవధిలోనే అభివృద్ధి పనులు చేపట్టలేదని అది ఒక్క గంట శ్రీనివాసరావుకె సాధ్యమవుతుందని ప్రస్తుతం ప్రారంభించిన రోడ్డు నిర్మాణం పనులే ఉదాహరణగా చెప్పుకోవాలి. ఈ కార్యక్రమంలో టిడ్కో గృహాల అధికారులు, ఆరో వార్డు అధ్యక్షుడు గరే గురునాథ్, సెక్రటరీ లొడగల జానకి రామ్,5వార్డు టిడిపి సీనియర్ నాయకులు మొల్లి లక్ష్మణ రావు, మన్యల సొంబాబు, బోయి శ్రీను,రమాదేవి, వార్డు బి సి సెల్ అధ్యక్షుడు రెడ్డి సత్యనారాయణ, పోలిశెట్టి నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.