టిబీ ముక్త భారత్ అభియాన్‌లో జోష్ కార్యక్రమం ప్రారంభం
టిబి ముక్తభారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జోష్ (జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్) వర్చువల్ గా కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించడం
నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ : ఈరోజు నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో టిబి ముక్తభారత్ అభ్యంతర కార్యక్రమంలో భాగంగా జోష్ జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ టిబి ముక్తభారత్ అభియాన్ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని మరియు డాక్టర్ వి సుజాత మేడం గారు అధ్యక్షతన నెల్లూరు లెప్రసీ ఎయిడ్స్ మరియు టీబీ అధికారి డాక్టర్ ఎస్కే ఖాదరవల్లి మరియు వివిధ జిల్లా అధికారులు వర్చువల్ గా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ టిబి ముక్తభారత్ అభియాన్ వర్చువల్ కార్యక్రమం ద్వారా 2030 నాటికి దేశంలో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించి క్షయ రహిత భారత దేశం సాధించడమే ధ్యేయంగా పని చేయాలని మరియు బ్లాక్ స్థాయిలో NCC క్యాడెట్లు ,మై భారత్ వాలంటీర్లు చురుగ్గా పాల్గొని టిబి నిర్మూలన విధానాన్ని ప్రజల్లో చురుగ్గా తీసుకొని పోయి వారికి విస్తృత అవగాహన కల్పించాలని, క్షయ వ్యాధి లక్షణాలను సకాలంలో గుర్తించి సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం వైద్యుల సలహాలు మేరకు క్షయ వ్యాధి మందులు వాడాలని మరియు ప్రజల్లో క్షయ వ్యాధిపై చైతన్యం కలిగే కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో చేయాలని కొని ఆడారు. ఈ జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ టిబి ముక్తభారత్ అభియాన్ కార్యక్రమంలో టిబి ముక్త పంచాయితీ లకు సంబంధించి క్షేత్రస్థాయి సిబ్బందికి గాంధీ విగ్రహాలను మరియు సర్టిఫికెట్లను ప్రధానం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో టిబి వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండేవిధంగా టిబి ముక్తాభారత్ అభియాన్ పోస్టర్స్ ను ఆవిష్కరించడం జరిగింది . ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖతో పాటు , విద్యాశాఖ, నెహ్రూ యువ కేంద్ర సిబ్బంది మరియు వివిధ శాఖ అధికారులు, నెల్లూరు జిల్లా టిబి నివారణ సిబ్బంది అందరూ పాల్గొని జాయింట్ స్క్వాడ్ ఫర్ టిబి ముక్త భారత్ అభియాన్ హెల్త్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు