BREAKING
రీజనల్ సమ్మిట్ ఎగ్జిబిషన్‌ను సందర్శించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభివృద్ధి పనులు, తాగునీటి సమస్యలపై మంత్రి నారాయణతో సమావేశం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పత్తి కొనుగోళ్లకు రంగం సిద్ధం చేయాలి.... జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అంగన్వాడి సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలి......... ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మ జా మా ఊరు దారిని మేము కాపాడుకుంటాం పొదలాడ ప్రజలు రాస్త రోకో క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి ఎస్పీ జగదీష్‌ ఆదహళ్లి ఓటీటీలోనూ అదరగొడుతున్న బెత్లెహమ్ కుటుంబ యూనిట్.. ఏకంగా 5.4 మిలియన్ల వ్యూస్‌తో సరికొత్త రికార్డ్! అభివృద్ధి అవకాశాలను వెలుగులోకి తేవడమే ప్రాంతీయ సదస్సుల లక్ష్యం : రాష్ట్ర పరిశ్ర‌మ‌ల శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఎన్. యువ‌రాజ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి విశాఖను తూర్పు తీర ఆర్థిక ముఖద్వారంగా అభివృద్ధి చేస్తాం మోదీ గారి 25 ఏళ్ల పాలనా ప్రస్థానం భారత రాజకీయాల్లో నవశకం: ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్స్ పరిశీలన కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు కొత్త ఊపు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది టీచర్లే విశాఖ బీచ్‌లో విషాదం....ప్రాణాలు కోల్పోయిన నిజామాబాద్ యువకుడు.

తడి చెత్త పొడి చెత్తను వేరు చేయాలి

Select Suryaa Now
తడి చెత్త పొడి చెత్తను వేరు చేయాలి

డిప్యూటీ ఎంపీడీవో హజరత్ అలీ 

పామూరు, మేజర్ న్యూస్: గ్రామాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పారిశుధ్యాన్ని కాపాడాలని డిప్యూటీ ఎంపీడీవో హజరత్ అలీ సూచించారు. మండలంలోని వగ్గంపల్లి స్వర్ణ గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛ పదం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో చెత్తను ఇష్టారాజ్యంగా వేయకుండా తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి అందించాలని తెలిపారు. చెత్తను వేరు చేయడం వల్ల గ్రామంలో పారిశుధ్య నిర్వహణ మెరుగుపడటంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని చెప్పారు. ప్రతి కుటుంబం పారిశుధ్యంపై అవగాహన పెంచుకుని గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు తమవంతు బాధ్యతగా సహకరించాలని కోరారు. పరిశుభ్రమైన వాతావరణంతోనే ప్రజలకు ఆరోగ్యం గ్రామానికి అభివృద్ధి సాధ్యమవుతుందని హజరత్ అలీ  పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారి ఇండ్ల హరినారాయణ, ఎస్‌జీఎస్‌డబ్ల్యూ, గ్రామస్తులు పాల్గొన్నారు.