BREAKING
వెంగళరావు నగర్ కాలనీలో ఘనంగా రావణ దహన కార్యక్రమం ఎంపీ మల్లుకు శేరి దసరా శుభాకాంక్షలు శ్రీ షిర్డీ సాయిబాబా 108వ పుణ్యతిధి వేడుకలు ఘనంగా నిర్వహణ రష్మిక మందన్నతో ప్రేమ, పెళ్లి విషయాలపై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు! డామా గ్యాస్ట్రో క్లినిక్ ప్రారంభోత్సవం ముఖ్యఅతిథిగా హాజరైన జనసేన రాష్ట్ర నాయకులు ముమ్మారెడ్డి ప్రేమకుమార్ కేసిఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లు కూకట్ పల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ కోఆర్డినేటర్ రెడ్డి సతీష్ ఆరోరా తిరుపతి, చంద్రగిరిలో అరాచకాలకు పోలీసులే బాధ్యులు! –ఎస్పీ సుబ్బరాయుడును తక్షణమే సస్పెండ్‌ చేయాలి ఆర్‌సీ 17 సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతంపై క్లారిటీ ఇచ్చిన మైత్రీ రవిశంకర్! ఆరోగ్యకర జీవనశైలికి సమతుల్య ఆహారం ముఖ్యం: ఎస్.ఎం. వెల్ నెస్ సెంటర్ ప్రారంభోత్సవంలో మహిత స్వామి! కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? *కోహీర్ మండల సేవాదళ్ అధ్యక్షులు శ్రీనివాస్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్‌కు శాలువాతో సన్మానం* ఎముకల బలహీనతకు కేవలం కాల్షియం లోపమే కారణం కాదా? ఈ అనారోగ్య సమస్యలే అసలు ముప్పు! పోలీసు అమరవీరులకు ఘన నివాళులు   - జిల్లా ఎస్పీ తుషార్ డూడి - విధి నిర్వహణలో అశువులు బాసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం ప్రీ-డయాబెటిస్ ఉంటే మధుమేహం ఖాయమా? అసలు నిజాలు మరియు నివారణ మార్గాలు! అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల: వేర్వేరు గ్రూపుల్లో భారత్, పాకిస్థాన్!

సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యానికి న్యాయం చేసింది: రెడ్డి శాంతి.

Select Suryaa Now
సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యానికి న్యాయం చేసింది: రెడ్డి శాంతి.

పాతపట్నం, సూర్య : ప్రజాస్వామ్య పరిరక్షణకు సుప్రీంకోర్టు ముందుకొచ్చిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే, పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త  రెడ్డి శాంతి  అన్నారు. 'ఎన్నికల సమయంలో దాడులు, దౌర్జన్యాలు, వాహనాల దహనం వంటి ఘటనలు జరిగాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఆధారాలతో YCP సుప్రీంకోర్టుకు వెళ్తే 19 చోట్ల తిరిగి నామినేషన్లు స్వీకరించాలని ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కీలక పరిణామం  చోటుచేసుకుంది. నామినేషన్ల దాఖలులో అభ్యర్థులు ఎదుర్కొన్న ఇబ్బందులపై వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను అక్టోబరు 25, 2026 వరకు వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

నామినేషన్ల గడువు పొడిగింపు అంశంపై కూడా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో ఎలాంటి రాజీ ఉండకూడదనే అంశాన్ని సుప్రీంకోర్టు తన ఆదేశాల ద్వారా స్పష్టం చేసిందని ఆమె అన్నారు.

రిపోర్టర్ : జగన్ మోహన్, పాతపట్నం, శ్రీకాకుళం జిల్లా.