సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్.
వైయస్సార్ సీపీ మొదలియార్ సంఘం రాష్ట్ర నాయకులు జ్ఞాన జగదీష్
దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని వైయస్సార్ సీపీ మొదలియార్ సంఘం రాష్ట్ర నాయకులు జ్ఞాన జగదీష్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టులో తెలుగుదేశం పార్టీ (తెదేపా) శ్రేణులకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందన్నారు. గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు 34 శాతం కుదరదని అనేక మార్లు ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మభ్యపెట్టాలని ఉద్దేశంతో రిజర్వేషన్ రాజకీయానికి తెరదేశిందని ఆరోపించారు. న్యాయస్థానం బిసి రిజర్వేషన్ల పై హైకోర్టు తీర్పుని సమర్థించడం సంతోషదాయకమని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం దానికి అనుకూలంగా దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేస్తూ, ఊరట ఇచ్చేందుకు నిరాకరించిందనీ తెలిపారు.స్థానిక సంస్థల్లో బీసీలకు కేటాయించే రిజర్వేషన్ల శాతం పై కోర్టుల్లో సుదీర్ఘంగా వివాదం నడుస్తోంది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా, హైకోర్టు రిజర్వేషన్లపై స్టే విధించింది అన్నారు. దీనితో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో తీవ్ర ఆలస్యం జరుగుతూ వచ్చిందన్నారు. రిజర్వేషన్ల శాతాన్ని ఖరారు చేయకుండా 50 శాతం పరిమితి దాటి రిజర్వేషన్లు అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలుగుదేశం నాయకులు, మద్దతుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారనీ అయితే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఇవాళ తీర్పు వెలువరించడంతో తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు మాత్రం వైసిపి వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు.
ఉమశంకర్, ప్రతినిధి, చిత్తూరు