BREAKING
ఏపీలో 3 లక్షల పేదల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం ఎమ్మెల్యే లారీలకు టోల్ రుసుం ఎందుకు కట్టాలి? అమెరికాలో కలకలం, చైనా కోసం గూఢచర్యం చేసిన కాలిఫోర్నియా మహిళ అరెస్ట్ పాలకొల్లులో విద్యార్థులకు ఉచితంగా 250 సైకిళ్ల పంపిణీ అమెరికాలో తైవాన్ కొత్త కార్యాలయం ప్రారంభం, పర్యటనపై చైనా ఆగ్రహం అమెరికాలో నాంటకెట్ తీరంలో కూలిన మెడికల్ విమానం పరాగ్వే రాజధాని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న విపక్షం అమెరికాలో కాల్పుల కలకలం స్థానిక సంస్థల ఎన్నికలపై సింగనమలలో మండలస్థాయి సన్నాహక సమావేశం కార్పొరేషన్ ఎన్నికల్లో చేనేత వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలి ఎమ్మెల్యే దగ్గుపాటికి చేనేత కార్మికుల ఐక్య వేదిక వినతి 2047 నాటికి 'వికసిత్ భారత్' సాధ్యమే: 5 కీలక ప్రాధాన్యతలను వెల్లడించిన ప్రధాని ముఖ్య కార్యదర్శి-2 శక్తికాంత దాస్ మంచిర్యాలలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గర్భిణీ మృతి.. నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబ సభ్యులు పెట్టుబడులతో పౌరసత్వం: సరికొత్త ఆఫర్ ప్రకటించిన అర్జెంటీనా కార్తీకమాసం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నేడు యధావిధిగా పీజీఆర్ఎస్

స్థానిక పోరుకు బీసీవై పార్టీ సన్నదం

Select Suryaa Now
స్థానిక పోరుకు బీసీవై పార్టీ సన్నదం

*స్థానిక పోరుకు బీసీవై సన్నద్ధం*

* అన్ని స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపుతాం

* పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నాం

* బీసీ రిజర్వేషన్ల అమలులో ప్రభుత్వం విఫలం

* బీసీవై కాకినాడ జిల్లా అధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు

కాకినాడ సూర్య ప్రతినిధి

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బలమైన అభ్యర్థులను పోటీకి నిలిపేందుకు బీసీవై పార్టీ సన్నద్ధమవుతోందని ఆ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు తెలిపారు. పార్టీ వ్యవస్థాపకుడు బోడే రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

కాకినాడ దేవాలయం వీధిలోని వెంకి రెసిడెన్సీలో బీసీవై పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాయుడు నాగేశ్వరరావుతో పాటు షీతల్, కర్రి గోపాలకృష్ణ, రాయుడు సుధాకర్, శీరం శ్రీను, నాగేశ్వరి మాట్లాడారు.

ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ హామీని అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విఫలమైందని వారు విమర్శించారు. బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం దక్కాలన్న లక్ష్యంతో స్థానిక సంస్థల ఎన్నికలను బీసీవై పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోందన్నారు. అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధమవుతూ, ఆయా ప్రాంతాల్లో బలమైన అభ్యర్థులను గుర్తించే ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో బీసీవై సమన్వయ కమిటీ సభ్యుడు గొంప శివతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.