BREAKING
రీజనల్ సమ్మిట్ ఎగ్జిబిషన్‌ను సందర్శించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభివృద్ధి పనులు, తాగునీటి సమస్యలపై మంత్రి నారాయణతో సమావేశం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పత్తి కొనుగోళ్లకు రంగం సిద్ధం చేయాలి.... జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అంగన్వాడి సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలి......... ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మ జా మా ఊరు దారిని మేము కాపాడుకుంటాం పొదలాడ ప్రజలు రాస్త రోకో క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి ఎస్పీ జగదీష్‌ ఆదహళ్లి ఓటీటీలోనూ అదరగొడుతున్న బెత్లెహమ్ కుటుంబ యూనిట్.. ఏకంగా 5.4 మిలియన్ల వ్యూస్‌తో సరికొత్త రికార్డ్! అభివృద్ధి అవకాశాలను వెలుగులోకి తేవడమే ప్రాంతీయ సదస్సుల లక్ష్యం : రాష్ట్ర పరిశ్ర‌మ‌ల శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఎన్. యువ‌రాజ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి విశాఖను తూర్పు తీర ఆర్థిక ముఖద్వారంగా అభివృద్ధి చేస్తాం మోదీ గారి 25 ఏళ్ల పాలనా ప్రస్థానం భారత రాజకీయాల్లో నవశకం: ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్స్ పరిశీలన కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు కొత్త ఊపు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది టీచర్లే విశాఖ బీచ్‌లో విషాదం....ప్రాణాలు కోల్పోయిన నిజామాబాద్ యువకుడు.

సొసైటీ ద్వారా యూరియా డిఏపి పంపిణీ

Select Suryaa Now
సొసైటీ ద్వారా యూరియా డిఏపి పంపిణీ

వింజమూరు, మేజర్ న్యూస్: వింజమూరు సొసైటీ ఆధ్వర్యంలో చైర్మన్ చల్ల వెంకటేశ్వర్లు యాదవ్ నేతృత్వంలో బుధవారం 25 మంది రైతులకు యూరియా, డీఏపీ ఎరువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ సొసైటీకి 18 టన్నుల యూరియా, 13 టన్నుల డీఏపీ నిల్వ వచ్చిందని తెలిపారు. రైతులకు డీఏపీ బస్తాను రూ.1,350, యూరియా బస్తాను రూ.266 చొప్పున పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అవసరమైన రైతులు సొసైటీ కార్యాలయాన్ని సంప్రదించి ఎరువులను పొందాలని చైర్మన్ సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువుల పంపిణీ చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ సీఈఓ మేకల రమణయ్య, మద్దూరి రాజగోపాల్ రెడ్డి, సిబ్బంది శ్రీనివాసులు రెడ్డి, రాధాతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.