శ్రీకాళహస్తిలో నామినేషన్ల ప్రక్రియలు ఉద్రేకత
శ్రీకాళహస్తిలో నామినేషన్లు ప్రక్రియలో ఉద్రిక్తత. వైసీపీ నేతలు అడ్డగింతతో ఇరువర్గాలు మధ్య ఘర్షణ. పోలీసులు లాఠీఛార్జ్.. వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు గాయాలు. తనపై పురుష పోలీసులు లాఠీఛార్జ్ చేశారంటూ పవిత్రరెడ్డి ఆరోపణ. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థితో కలిసి వచ్చిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బియ్యపు మధుసూదనరెడ్డి కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి, ఆమె కుమారుడు ఆకర్షరెడ్డిలను టీడీపీ నేతలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో వైయస్సార్ పార్టీ, తెలుగుదేశం నాయకులు ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగి స్వల్పంగా లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలుస్తుంది. తనపై మహిళా పోలీసులతో పాటు పురుష పోలీసులు కూడా లాఠీఛార్జ్ చేశారని పవిత్రారెడ్డి ఆరోపించారు. శ్రీకాళహస్తిలో పోలీసులు సమక్షంలోనే టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని తెలిపారు .