రేపు ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన
l
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మరోసారి మారనుంది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే నెల్లూరు మరియు రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.