BREAKING
ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్రఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ ఈక్విటీల వైపు మళ్లీ క్యూ కడుతున్న విదేశీ పెట్టుబడులు పైడితల్లి అమ్మవారి పండగకు చిన్న శ్రీను, వారి కుమార్తె సిరమ్మ ను ఆహ్వానించిన పూజారులు ఎంఏఎం కళాశాలల్లో ఘనంగా ఫ్రెషర్స్‌ డే వేడుకలు సెప్టెంబర్‌లో దూసుకెళ్లిన టెస్లా చైనా ఈవీ విక్రయాలు తెలంగాణ మోడల్ స్కూల్‌లో ముందస్తుగా ఘనంగా బతుకమ్మ వేడుకలు. ఆలయాల్లో అభివృద్ధి వెలుగులు నింపుతున్న ఆనం రామనారాయణరెడ్డి! నగరాభివృద్ధికి టీటీడీ 200 కోట్లు విడుదల -జేఈఓకు టిటిడి చైర్మన్, వైస్ చైర్మన్ కృతజ్ఞతలు అమెరికాలో భారీగా మిగిలిన మొక్కజొన్న నిల్వలు స్థానిక ఎన్నికల్లో బీసీలు టీడీపీకి తగిన బుద్ధి చెప్పాలి అరకు పార్లమెంట్ ఎన్నికల కమిటీలో జనసేన ఐటీ కోఆర్డినేటర్ పైల సత్యన్నారాయణకు చోటు ఎగుమతిదారులకు కస్టమ్స్ పథకాలపై అవగాహన కార్యక్రమం హైదరాబాద్లో ఫియో, ఐసీఐసీఐ బ్యాంక్ సంయుక్త నిర్వహణ ఉద్యోగ నివేదికల వెలువడే వేళ లాభాల బాటలో టీఎస్‌ఎక్స్ ఫ్యూచర్స్, పెరుగుతున్న బంగారం ధరలు బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి బుచ్చి సి హెచ్ సి కి 39 లక్షల వైద్య పరికరాలు అందజేత

రైతులకు పశుగ్రాసం పెంపకానికి అవకాశం.

Select Suryaa Now
రైతులకు పశుగ్రాసం పెంపకానికి అవకాశం.

సూర్య న్యూస్ ముండ్లమూరు. 

విబిజి రాంజీ పథకం క్రింద 2026-27 ఆర్థిక సంవత్సరంలో బహు వార్షిక పశు గ్రాస పెంపకం నకు అవకాశం కల్పించడం జరిగినదని, అర్హులైన రైతులు 25 సెంట్లు నుండి ఒక ఎకరా వరకు పశు గ్రాసాన్ని సాగు చేసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగినదని ఏపీ ఓ టి వెంకట్రావు తెలిపారు. లబ్ధి దారుడు ఐదు ఎకరాల లోపు భూమి కలిగి ఉండాలని, వి బి జి రామ్ జి పథకం నందు జాబ్ కార్డు కలిగి ఉండాలని,లబ్ధి దారుడు సొంత భూమి కలిగి ఉండాలని నీటి సదుపాయం కలిగి ఉన్న 
లబ్ధిదారులు మీ  స్వర్ణ గ్రామపంచాయతీ  వెటర్నరీ అసిస్టెంట్స్ వద్ద దరఖాస్తు చేసుకోవాలనీ ఏపీవో కోరారు.2 పశువులు కలిగి ఉన్న లబ్ధిదారులు 25 సెంట్లు .  పశువుల కలిగి ఉన్న 0.5 ఎకరా  5 అంటే ఎక్కువ పశువులు కలిగి ఉన్న 1.00 ఎకరా వరకు అర్హులు  గా ప్రభుత్వ నిర్ధారించినదన్నారు. 1.00 ఎకరాకు రెండు సంవత్సరాలకు పశు గ్రాసాన్ని సాగు చేసుకున్నందుకు  69,781 రూపాయలు లబ్ధిదారుడికి చెల్లించబడుతుందని .మొదటి సంవత్సరం 43573 రెండవ సంవత్సరం 26,208 నగదు వేతనాల రూపంలో నేరుగా రైతు ఖాతాలకు చెల్లించబడుతుందన్నారు. 
అర్హత కలిగిన రైతులందరూ మీ స్వర్ణ గ్రామపంచాయతీ నందు గల వెటర్నరీ అసిస్టెంట్, ముండ్లమూరు ,ఈదర ,మారెళ్ళ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సంప్రదించవలసిందిగా ఏపీవో టీ వెంకట్రావు కోరారు.