ప్రత్యేక అలంకరణలలో అంకాలమ్మ పోలేరమ్మ అమ్మవార్లు
:సిఎస్ పురం,మేజర్ న్యూస్,,దసరా పండుగ సందర్భంగా మండలంలోని శీలంవారిపల్లె గ్రామంలో అంకాలమ్మ పోలేరమ్మ దేవస్థానంలలో అమ్మవార్లను ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు.ఉదయం అంకాలమ్మ పోలేరమ్మ అమ్మవార్లకు పట్టువస్త్రాలు పూలమాలలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు.ఈసందర్భంగా గ్రామంలోని పలువురు మహిళలు భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.