BREAKING
ఏపీలో 3 లక్షల పేదల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం ఎమ్మెల్యే లారీలకు టోల్ రుసుం ఎందుకు కట్టాలి? అమెరికాలో కలకలం, చైనా కోసం గూఢచర్యం చేసిన కాలిఫోర్నియా మహిళ అరెస్ట్ పాలకొల్లులో విద్యార్థులకు ఉచితంగా 250 సైకిళ్ల పంపిణీ అమెరికాలో తైవాన్ కొత్త కార్యాలయం ప్రారంభం, పర్యటనపై చైనా ఆగ్రహం అమెరికాలో నాంటకెట్ తీరంలో కూలిన మెడికల్ విమానం పరాగ్వే రాజధాని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న విపక్షం అమెరికాలో కాల్పుల కలకలం స్థానిక సంస్థల ఎన్నికలపై సింగనమలలో మండలస్థాయి సన్నాహక సమావేశం కార్పొరేషన్ ఎన్నికల్లో చేనేత వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలి ఎమ్మెల్యే దగ్గుపాటికి చేనేత కార్మికుల ఐక్య వేదిక వినతి 2047 నాటికి 'వికసిత్ భారత్' సాధ్యమే: 5 కీలక ప్రాధాన్యతలను వెల్లడించిన ప్రధాని ముఖ్య కార్యదర్శి-2 శక్తికాంత దాస్ మంచిర్యాలలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గర్భిణీ మృతి.. నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబ సభ్యులు పెట్టుబడులతో పౌరసత్వం: సరికొత్త ఆఫర్ ప్రకటించిన అర్జెంటీనా కార్తీకమాసం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నేడు యధావిధిగా పీజీఆర్ఎస్

ప్రతి నిర్వాసితులకి న్యాయం జరిగే వరకూ పోరాటం

Select Suryaa Now
ప్రతి నిర్వాసితులకి న్యాయం జరిగే వరకూ పోరాటం

ప్రతి నిర్వసితుడికి న్యాయం జరిగే వరకు సీపీఎం పోరాటం..

మోటార్ సైకిల్ యాత్రలో కేంద్ర కమిటీ సభ్యులు లోకనాధం..

వి ఆర్ పురం మేజర్ న్యూస్

పోలవరం జిల్లా చింతూరు డివిజన్లోఅక్టోబర్ 1 న ప్రారంభమైన మోటార్ సైకిల్ యాత్ర వి ఆర్ పురం  మండలంలో ధర్మతాల గూడెం  గ్రామంలో 4 వ రోజు మొదలయ్యింది.. ఈ యాత్రకు ప్రతి గ్రామంలో జనాలు పూల మాలలతో, పుష్ప గుచ్చాలతో,హరతులతో ఘన స్వాగతం పలికారు. రేకపల్లి  గ్రామంలోని జంక్షన్ వద్ద పూనం సత్యనారాయణ చిన్న మట్టపల్లి కారం శివయ్య  గ్రామంలోని సున్నవారిగూడెం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య, అడివి వెంకన్న గూడెం కుంజ. బోజ్జి, స్టూపాలకు అంజలి ఘటిస్తూ యాత్ర కొనసాగింది. ఈ సందర్బంగా  రేఖపల్లి  గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యులు లోక నాధం మాట్లాడుతూ రేకపల్లి గొల్లగూడెం గ్రామం ముంపు లో చేర్చి నష్టపరిహారం ఇవ్వాలని  ప్రతి ఒక్క నిర్వసితుడికి న్యాయంం జరిగే వరకు సీపీఎం పార్టీ పోరాడుతుందని స్పష్టం చేసారు.పోలవరం నిర్వసిత గ్రామాలు  నష్టపోయే రైతులకు, నిర్వసితులను కేంద్ర రాష్ట్ర  ప్రభుత్వాలు పరిహారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాయని అన్నారు.గ్రామాలు తరలించే నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి యువకులకు ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేసారు. రాష్టానికి 'జీవ నాడి 'ప్రాజెక్టు అని చెప్తూ సర్వం త్యాగం చేస్తున్న నిర్వసితులకు మాత్రం అన్యాయం చేస్తున్నాయని అన్నారు ఉమ్మడివరం గ్రామంలో జరిగిన సమావేశంలో లోత రామారావు మాట్లాడుతూ  ఏళ్ళు దాటిందని కాని జీ. ఓ. నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా చట్టాన్ని తీసుకోస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పటికి గిరిజనలకు న్యాయం చేయడంలో విఫలమయ్యారని అన్నారు. విలీన మండలాల్లో రోడ్లు దుర్భరంగా ఉన్నాయని పేర్కొన్నారు పోలవరం పేరుతో ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కరువైందని అన్నారు. ఈ ప్రాంత ప్రజలను తరలించే వరకు ఈ ప్రాంత వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేసారు. ధర్మ తాళ్ల గూడెం నుండి వి ఆర్ పురం రాజుపేట అన్నవరం గుర్రంపేట పెద్దమటపల్లి మీదుగా చింతరేగుపల్లి అడి వెంకన్న గూడెం సోములు గూడెం రామవరం రామవరంపాడు చొప్పల్లి మీదుగా ములకలపల్లి కుందులూరు జల్లివారిగూడానికి చేరుకుంది.4వ రోజు 70 కిలోమీటర్లు ఎక్కడికక్కడ ఘన స్వాగతం సమస్యలపై వినతులు అందజేసిన ప్రజలు మొత్తం 33 గ్రామాలు 70 కిలోమీటర్లు పాదయాత్ర సాగింది.