BREAKING
వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి పంటల పరిస్థితులను పరిశీలించారు మండల కాంగ్రెస్ అధ్యక్షునికి ఘన సన్మానం కార్యకర్తల అభిప్రాయానికే పెద్దపీట: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము జంమ్గి గ్రామంలో 'జలసిరి – విబిజి రాంజీ తో జల సంరక్షణకు బాటలు! సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎండీ అతిఫ్ హుస్నాబాద్‌లో చికెన్ వ్యర్థాల వేలం.. రూ. ఆరు లక్షల 5000 పాట! ఐమాక్స్ లైక్ లను ప్రారంభించిన సర్పంచ్ నాగుల సత్యనారాయణ యాదవ్ అరుణాచల గిరిప్రదక్షిణకు నాగర్‌కర్నూల్‌ నుంచి ప్రత్యేక బస్సు -నాగర్ కర్నూల్ డిపో మేనేజర్ యాదయ్య బీఆర్ఎస్ నాయకునికి పరామర్శ..... *తుల్జాపూర్ అంబాభవాని అమ్మవారిని దర్శించుకున్న పులిమామిడి మమత రాజు దంపతులు* ఏపీ జెన్కో సంస్థలో విలీనం చేయాలి. *నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.. దుర్గాభవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు* ప్రజాసేవే పరమావధి.. పేదల పెన్నిధి డాక్టర్ మంచి కంటి రామస్వామి....! *సదాశివపేట, సంగారెడ్డి కలెక్టరేట్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న నిర్మల జగ్గారెడ్డి* భారత్ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ దూకుడు

ప్రజల ఆశీస్సులతో జనసేన వీరమహిళ విజయలక్ష్మి గునుకుల నామినేషన్

Select Suryaa Now
ప్రజల ఆశీస్సులతో జనసేన వీరమహిళ విజయలక్ష్మి గునుకుల నామినేషన్

నెల్లూరు, మేజర్ న్యూస్ :       ప్రజాసేవే పరమావధిగా, 21వ డివిజన్ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా జనసేన పార్టీ కూటమి అభ్యర్థిగా విజయలక్ష్మి గునుకుల శనివారం నామినేషన్ దాఖలు చేశారు.  జనసేన నాయకులు కిషోర్ గునుకుల నివాసం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, అభిమానులు, మద్దతుదారుల సమక్షంలో ఉత్సాహంగా బయలుదేరిన ఆమె, స్థానిక ఎనమలవారిదిన్నె వద్ద ఉన్న RO  కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు.  ఈ సందర్భంగా విజయలక్ష్మి గునుకుల మాట్లాడుతూ,“ఈ నామినేషన్ కేవలం ఎన్నికల ప్రక్రియ కాదు… మా డివిజన్ ప్రజలపై మాకున్న బాధ్యతకు, వారి అభివృద్ధి పట్ల మాకున్న నిబద్ధతకు నిదర్శనం”  అని పేర్కొన్నారు.ఇప్పటికే డివిజన్‌లోని ప్రతి గడపను పలకరిస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారి ఆప్యాయతను, ఆదరణను హృదయపూర్వకంగా స్వీకరించామని తెలిపారు. ప్రజలు తమపై చూపుతున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, రానున్న రోజుల్లో మరింత అంకితభావంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్  చూపిన ప్రజాసేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని, మంత్రి శ్రీ పొంగూరు నారాయణ   అభివృద్ధి దృక్పథాన్ని స్ఫూర్తిగా చేసుకుని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతామని తెలిపారు. తన భర్త, జనసేన నాయకులు కిషోర్ గునుకుల సహకారంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని పేర్కొన్నారు.

“మాకు రాజకీయాలు పదవుల కోసం కాదు… ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం. ప్రతి ఇంటి సమస్య మా సమస్యగా భావించి, ప్రతి కుటుంబం అభివృద్ధిలో భాగస్వామి అయ్యేలా కృషి చేస్తాం. ప్రజలు మాపై ఉంచిన నమ్మకమే మా బలం… వారి ఆశీస్సులే మా విజయం”  అని భావోద్వేగంగా తెలిపారు. నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసి తమకు మద్దతుగా నిలిచిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు, వీరమహిళకు,  అభిమానులకు, శ్రేయోభిలాషికి ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో అందరూ ఐక్యంగా కృషి చేసి, 21వ డివిజన్‌లో కూటమి విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజలతోనే ప్రయాణం… ప్రజల కోసమే పోరాటం… అభివృద్ధే మా సంకల్పం! జై జనసేన! జై పవన్ కళ్యాణ్!