BREAKING
30వ వార్డులో మహబూబ్ బాషా వినూత్న ప్రచారం ఇంటింటా ప్రచారంతో ప్రజల్లోకి చంద్రకళ రమేష్ గంటవూరులో వనిత శ్రీధర్ నాయుడు ప్రచారం జోరు జమ్మూలో పాకిస్తానీయుల అక్రమ నివాసం: 65 మందిపై క్రైమ్ బ్రాంచ్ ఛార్జ్‌షీట్! బ్రోకర్ ట్రేడింగ్ టెర్మినళ్ల దుర్వినియోగానికి అడ్డుకట్ట: త్వరలో కఠిన నిబంధనలు తేనున్న సెబీ.. ఛైర్మన్ తుహిన్ కాంత పాండే కీలక ప్రకటన! నేటి పంచాంగం 25 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –25 అక్టోబర్ 2026 అనివార్య కారణాలతో భారత్ పర్యటన రద్దు చేసుకున్న ఇరాన్ స్పీకర్ గలీబాఫ్: బెంగళూరు ట్రాఫిక్‌తో విసిగిపోయారా? రూ.3 లక్షల కార్ హ్యాక్‌తో నెటిజన్లను ఆశ్చర్యపరిచిన టెక్కీ ముంబై రెస్టారెంట్లపై ఎఫ్‌డీఏ కొరడా: ఒట్టోమన్ కేఫ్, భారత్ క్యాంటీన్ సహా 7 హోటళ్ల లైసెన్సులు రద్దు.. ఎఫ్‌1 యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్ క్వాలిఫైయింగ్ లైవ్ స్ట్రీమింగ్: నవంబర్ 1న రాహుల్ గాంధీ ర్యాలీతో ఢిల్లీ మార్కెట్లకు రూ.10,000 కోట్ల దెబ్బ: కేరళ లోక్ భవన్ కిచెన్‌లో మాంసాహారంపై నిషేధం: బాధ్యతలు చేపట్టిన తొలిరోజే గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్ కీలక ఆదేశాలు.. ప్రోస్టేట్ క్యాన్సర్ కణతులను కరిగించే సరికొత్త ఔషధం: జాన్సన్ అండ్ జాన్సన్ 'JNJ-6143' ట్రయల్స్‌లో కీలక పురోగతి.. సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయ ఉమ్రా యాత్రికులకు కేంద్రం అండ:

ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడటం విడ్డూరం

Select Suryaa Now
ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడటం విడ్డూరం

గుంటూరు: ప్రజాస్వామ్యం, నైతిక విలువల గురించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందని గుంటూరు పశ్చిమ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గళ్లా మాధవి విమర్శించారు. నామినేషన్ల గడువు పొడిగింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏదో ఒక పార్టీకి మాత్రమే పరిమితం కావని, అందరికీ సమానంగా వర్తిస్తాయని స్పష్టం చేశారు.

న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యేకంగా లభించిన ప్రయోజనంగా చిత్రీకరించేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. న్యాయస్థానాల నిర్ణయాలను రాజకీయ కోణంలో ప్రచారం చేయడం సరికాదన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, నైతిక విలువల గురించి మాట్లాడే ముందు జగన్‌ తన వైఖరిని సమీక్షించుకోవాలని గళ్లా మాధవి హితవు పలికారు.