పోలీసు పహారాలు విద్యా కమిటీ ఎన్నికలు
పోలీస్ పహారలో విద్యాకమిటి ఎన్నికలు
.. మండి పడ్డ వైసీపీ
ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి
ఎమ్మిగనూరు మండలంలోని రాళ్లదొడ్డి, సిరాలదొడ్డి, ఎర్రకోట, కడిమెట్ల గ్రామాల్లో విద్యా కమిటీ ఎన్నికలకు భారీగా పోలీసు బలగాలను మోహరించడంపై వైఎస్సార్‌సీపీ నాయకులు ఎర్రకోట రాజీవ్ రెడ్డి విమర్శలు చేశారు. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలకు ఇంతటి పోలీసు బందోబస్తు అవసరమా? ఆ నాలుగు గ్రామాలు ఒక విద్యా కమిటీ ఎన్నికలను బీహార్‌లో ఉన్నట్టు టీడీపీ నాయకులు చేస్తున్నారని ద్వజమెత్తరు..
కూటమి ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి నేతృత్వంలో తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేసేలా ఎన్నికల వాతావరణం సృష్టించారని ఆరోపించారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీ మద్దతు ఉన్న అభ్యర్థులు గెలుస్తారనే భయంతోనే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారని పార్టీ శ్రేణులు పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ‘నాడు–నేడు’ అభివృద్ధి పనులను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, ఎన్నికలు పోలీసు బలంతో కాకుండా ప్రజల స్వేచ్ఛతో, భయంతో కాకుండా ప్రజల నమ్మకంతో జరగాలని వైఎస్సార్‌సీపీ నాయకులు అన్నారు.