BREAKING
ఏపీలో 3 లక్షల పేదల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం ఎమ్మెల్యే లారీలకు టోల్ రుసుం ఎందుకు కట్టాలి? అమెరికాలో కలకలం, చైనా కోసం గూఢచర్యం చేసిన కాలిఫోర్నియా మహిళ అరెస్ట్ పాలకొల్లులో విద్యార్థులకు ఉచితంగా 250 సైకిళ్ల పంపిణీ అమెరికాలో తైవాన్ కొత్త కార్యాలయం ప్రారంభం, పర్యటనపై చైనా ఆగ్రహం అమెరికాలో నాంటకెట్ తీరంలో కూలిన మెడికల్ విమానం పరాగ్వే రాజధాని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న విపక్షం అమెరికాలో కాల్పుల కలకలం స్థానిక సంస్థల ఎన్నికలపై సింగనమలలో మండలస్థాయి సన్నాహక సమావేశం కార్పొరేషన్ ఎన్నికల్లో చేనేత వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలి ఎమ్మెల్యే దగ్గుపాటికి చేనేత కార్మికుల ఐక్య వేదిక వినతి 2047 నాటికి 'వికసిత్ భారత్' సాధ్యమే: 5 కీలక ప్రాధాన్యతలను వెల్లడించిన ప్రధాని ముఖ్య కార్యదర్శి-2 శక్తికాంత దాస్ మంచిర్యాలలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గర్భిణీ మృతి.. నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబ సభ్యులు పెట్టుబడులతో పౌరసత్వం: సరికొత్త ఆఫర్ ప్రకటించిన అర్జెంటీనా కార్తీకమాసం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నేడు యధావిధిగా పీజీఆర్ఎస్

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి

Select Suryaa Now
పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం.

కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాదం ఉద్ఘాటించారు.

** సోమవారంజరిగే ధర్నాకు అందరూ కలిసి రావాలని పిలుపు

వి ఆర్ పురం మేజర్ న్యూస్

  పోలవరం నిర్వాసితుల సమస్యల కోసం గిరిజన రైతుల పోడు భూముల పట్టాల కోసం సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఒకటవ తారీఖున ఎటపాక మండలం కన్నాయిగూడెం గ్రామంలో  ప్రారంభించినటువంటి బైక్ యాత్ర ఆదివారం విఆర్ పురం మండలానికి చేరింది. ఈ యాత్రకు అడుగడుగున జనాల నీరాజనాల మధ్య ఎంతో శోభయమానంగా యాత్ర జరగడం ఈ యాత్రలో వందలాదిమందిగా సిపిఎం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు కటాప్ డేట్ తో సంబంధం లేకుండా కాళీ చేసే నాటికి ప్రతి ఒక్కరికి నష్టపరిహారం చెల్లించాలని. అన్నవరం బ్రిడ్జి హై లెవెల్ బ్రిడ్జి కట్టించాలని. పోడు భూములకు ఆకుపత్రం  ఇవ్వాలని పెద్దమటపల్లి నుండి నర్సింగ్పేట వరకు ఏడు సంవత్సరాల క్రితం రోడ్డు తవ్వి వదిలేసారని తక్షణమే అర్హదారిని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పోలవరం నిర్వాసితులలో చిట్ట చివరి నిర్వాసితులకు అన్యాయం జరిగినా మేము సహించేది లేదని సిపిఎం పార్టీ ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు నిర్వాసితులకు న్యాయం చేసిందని ఇక ముందు కూడా సిపిఎం పార్టీ నిర్వాసితులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని  ఆయన మాట్లాడారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు  కార్యదర్శివర్గ సభ్యులు లోత రామారావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఎన్నో పోరాటాలు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ కుంజా బోజ్జి కామ్రేడ్ సున్నం రాజయ్య లాంటి గొప్ప నాయకుల లక్ష్యాల కోసం మా ప్రాణాలు త్యాగాలకైనా వెనకాడబోమని పేర్కొన్నారు నిర్వాసితుల కోసం వారు చేసిన పోరాటం అలుపెరగనిదని ఈరోజు నిర్వాసితులకి ఎంతో కొంత న్యాయం జరిగిందంటే వారు చేసిన పోరాటాల ఫలితం అని చెప్పి గుర్తు చేశారు వారి పోరాట స్ఫూర్తితో మరెన్నో ఉద్యమాలు లో చేసి ఈ ప్రాంత ప్రజలకు పోలవరం నిర్వాసితులకు న్యాయం చేసే అంతవరకు మా ఎర్రజెండా పోరాటం ఆపదని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు అడుగడుగునా అన్యాయమే జరిగిందని పనికిమాలిన  సర్వేలు చేసి అధికారులు నిజమైన నిర్వాసితులను గుర్తించడంలో విఫలమయ్యారు అని చెప్పి వాపోయారు.పొలాలు రహదారులు మునిగిపోతున్న కూడా కొన్ని గ్రామాలు నేటికీ సర్వే లో లేకుండా ఉన్నాయ్ ఆంటే వారి లైడార్ సర్వేలు ఎంత వాస్తవముంపుని చూపుతున్నాయో గమనించాలని అన్నారు. అటువంటి గ్రామాలను కూడా ఈ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వాలు గుర్తించకపోవడం దౌర్భాగ్యం అని ఈ పేద ప్రజలకు అండగా సిపిఎం పార్టీ అన్నివేళలా ఉంటుందని నిర్వాసితులకు అన్యాయం చేస్తే సహించబోమని హెచ్చరించారు. మండల కార్యదర్శి   పులి సంతోష్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని నిర్వాసితులను ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేయాలో అన్ని విధాలుగా ఈ అధికారుల గురి చేస్తున్నారని చాలామంది నిర్వాసితులకు ఇంతవరకు  ప్యాకేజీ కూడా పడలేదని వాటికోసం  ఐటీడీకి తిరిగి తిరిగి వారి చెప్పులు అరిగిపోతున్నాయి తప్ప నిర్వాసితులకు న్యాయం జరగడం లేదని పైసలు ఇస్తే ఫైలు కదులుతుందని లేదంటే కదిలే పరిస్థితి లేదని ఈ అధికారులు నిర్వాసితులను నిలువునా దోపిడీ చేస్తున్నారని అర్హులైనటువంటి నిర్వాసితులను కూడా ఆరెండర్ జాబితాలో చేర్చకుండా ఎవరైతే డబ్బులు ఇస్తారో వారి పేర్లు అక్రమంగా చేర్చి అక్రమాలకు ఈ అధికారులు పాల్పడుతున్నారని చెప్పి ఇటువంటి విధానాన్ని అధికారులు మానుకోకపోతే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం  రాష్ట్ర గిరిజన సంఘం నాయకులులోతా రామారావు, పోలవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు సున్నం. రాజులు. సోయం చినబాబు, సాయం సీతారామయ్య ఎంపీపీ కారం లక్ష్మి, మండల కార్యదర్శి పులి సంతోష్, కూనవరం మండల కార్యదర్శి బాబు బారయ్య ఎంపీటీసీ ప్రదీప్,మండల కార్యవర్గ సభ్యులు పంకు. సత్తి బాబు,కారం సుందరయ్య  కమిటీ సభ్యులు పొడియం శ్రీరామమూర్తి,లక్ష్మణ్, బాబురావు, బొజ్జి, తాతబాబు, సత్తిబాబు, వడ్లది రమేష్,రంగమ్మ,సత్యనారాయణ, పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.