BREAKING
'వారణాసి' చిత్రంలో ఏఐ వినియోగంపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.. అసలు నిజం ఇదే! ఓటీటీలోకి సరికొత్త మైండ్ గేమ్ షో.. హోస్ట్‌గా యంగ్ హీరో తేజ సజ్జ! Jr NTR: భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. త్వరలోనే 'డ్రాగన్' షూటింగ్: జూనియర్ ఎన్టీఆర్ విడుదలకు ముందే ఇంటర్‌నెట్‌లో లీకైన 'తెల్ల కాగితం' సినిమా.. మేకర్స్ ఆవేదన! 13 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా! ఏషియన్ గేమ్స్‌లో విత్యా రామ్‌రాజ్ సంచలనం.. అద్భుతమైన స్ప్రింట్‌తో భారత్‌కు గోల్డ్ మెడల్! అల్లరి నరేష్ ఇంట్లో ఘనంగా కూతురు పుట్టినరోజు వేడుకలు.. క్యూట్ ఫోటోలు వైరల్! భారత ఆర్కిటిక్ యాత్రలో గీతం పరిశోధకుడు విశాఖ ఉక్కులో తప్పిన ముప్పు: నేలపాలైన ద్రవ ఉక్కు జియోఫిజిక్స్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థులు సహకారం గుండె సమస్యలపై శ్రద్ధ వహించాలి..! చోరీ సొత్తు రికవరీలో ప్రతిభ.. సౌత్‌ క్రైమ్‌ పోలీసులకు 4 రివార్డులు పారిశ్రామికవాడలో పేదల పట్టాభిషేకం పేదవాడి ఆత్మగౌరవానికి ‘పట్టా’భిషేకం! స్థానిక సమరానికి వైకాపా సమరశంఖం : మళ్ళా విజయప్రసాద్ దిశానిర్దేశం

పెంచలోరి సన్నిధిలో శ్రీ త్రిదండి దేవనాధ రామానుజ జీయర్ స్వామి

Select Suryaa Now
పెంచలోరి సన్నిధిలో శ్రీ త్రిదండి దేవనాధ రామానుజ జీయర్ స్వామి

నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్  :  శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనకు మంగళవారం సాయంత్రం శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాధ రామానుజ జీయర్ స్వామి  విచ్చేశారు. క్షేత్రానికి విచ్చేసిన స్వామివారికి ఆలయ అధికారులు, అర్చకులు భక్తిశ్రద్ధలతో ఘన స్వాగతం పలికారు.
ఆలయ ప్రధాన అర్చకులు, ఇతర అర్చకులు, వేద పండితులు మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ జీయర్ స్వామివారికి ఆలయ మర్యాదలతో స్వాగతం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారిని, శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారిని, శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమం ఆలయ ఉప కమిషనర్, కార్యనిర్వహణాధికారి కోవూరు జనార్ధన్ రెడ్డి పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది, వేద పండితులు తదితరులు పాల్గొన్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.