BREAKING
మురుగు కాలువల పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు – 20 మంది అదనపు కార్మికుల నియామకం 13 ఏళ్ల వయసులోనే బాల్య వివాహం.. నటి రాగిణి వ్యక్తిగత జీవితం వెనుక కన్నీటి గాథ! రీజనల్ సమ్మిట్ ఎగ్జిబిషన్‌ను సందర్శించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభివృద్ధి పనులు, తాగునీటి సమస్యలపై మంత్రి నారాయణతో సమావేశం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పత్తి కొనుగోళ్లకు రంగం సిద్ధం చేయాలి.... జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అంగన్వాడి సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలి......... ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మ జా మా ఊరు దారిని మేము కాపాడుకుంటాం పొదలాడ ప్రజలు రాస్త రోకో క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి ఎస్పీ జగదీష్‌ ఆదహళ్లి ఓటీటీలోనూ అదరగొడుతున్న బెత్లెహమ్ కుటుంబ యూనిట్.. ఏకంగా 5.4 మిలియన్ల వ్యూస్‌తో సరికొత్త రికార్డ్! అభివృద్ధి అవకాశాలను వెలుగులోకి తేవడమే ప్రాంతీయ సదస్సుల లక్ష్యం : రాష్ట్ర పరిశ్ర‌మ‌ల శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఎన్. యువ‌రాజ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి విశాఖను తూర్పు తీర ఆర్థిక ముఖద్వారంగా అభివృద్ధి చేస్తాం మోదీ గారి 25 ఏళ్ల పాలనా ప్రస్థానం భారత రాజకీయాల్లో నవశకం: ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్స్ పరిశీలన కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు కొత్త ఊపు

పేద కుటుంబాలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్

Select Suryaa Now
పేద కుటుంబాలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్

ఆమదాలవలస, సూర్య : ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తుందని ఆమదాలవలస  ఎమ్మెల్యే సతీమణి, మాజీ ఎంపీపీ కూన ప్రమీల తెలిపారు. ఆమదాలవలస పట్టణంలో బుధవారం పలువురు లబ్ధిదారులకు  రూ.7 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. పేదలకు వైద్య సహాయం అందించడంలో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపుతున్నారని అన్నారు.
ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములవుతూ, ఆపదలో ఉన్న కుటుంబాలకు ఎమ్మెల్యే భరోసాగా నిలుస్తున్నారని తెలియజేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందన్నారు. అనారోగ్యంతో ఉన్న కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా స్థానిక ఎమ్మెల్యే వైద్య ఖర్చుల నిమిత్తం నియోజకవర్గంలో కోట్లాది రూపాయలను అందించడం జరిగిందన్నారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు భరోసా కల్పించడం ద్వారా ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే తన బాధ్యతను నిర్వహిస్తున్నారని, దీనివలన కుటుంబానికి కొంత ఆసరాగా నిలుస్తుందని తెలియజేశారు. ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా నేరుగా ఎమ్మెల్యే కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తమ్మినేని గీత, బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు కనితి విజయలక్ష్మి, పిఎసిఎస్ అధ్యక్షురాలు సిమ్మ మాధవి, టిడిపి పట్టణ మహిళా అధ్యక్షురాలు బోయిన సునీత, మాజీ కౌన్సిలర్ రెడ్డి గౌరీ, రాష్ట్ర కళింగ కార్పోరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్, టిడిపి మండల అధ్యక్షులు నూక రాజు, నారాయణపురం ఆనకట్ట చైర్మన్ సనపల డిల్లేశ్వరరావు, మాజీ సర్పంచ్ జోగి చంద్రశేఖర్, నేతింటి జ్యోతిశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : రాము, ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా.