పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓటేయండి
రేపల్లె మేజర్ న్యూస్;
పట్టణ అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం కృషి చేసి అభివృద్ధి పథంలో నడుపుతున్న మంత్రి అనగాని సత్యప్రసాద్ కృషిని గుర్తించి కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని 34 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షమీమ్ సుల్తానా ఆరిపా కోరారు వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి మంత్రి అనగాని పట్టణంలో చేస్తున్న అభివృద్ధి రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి అందిస్తున్న సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు వివరించి వార్డును మరింత అభివృద్ధి పథంలో నడుపుకునేందుకు చైర్పర్సన్ అభ్యర్థి కుర్ర అవర్ణ కు కౌన్సిలర్ అభ్యర్థిగా నాకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.