పసుపు జిగురు అట్టలతో పురుగు నియంత్రణ
బాడంగి, అక్టోబర్ 1 (మేజర్ న్యూస్): మండలంలోని పూడివలస గ్రామంలో వరి పంటలో దోమపోటు, ఇతర పురుగుల ఉధృతిని తగ్గించేందుకు పసుపు రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేయాలని గురువారం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులకు సూచించారు. పంట పొలాల్లో జిగురు అట్టలను కర్రలకు అమర్చి ఉంచడం ద్వారా పసుపు రంగుకు ఆకర్షితమయ్యే పురుగులను అట్టలకు అంటుకునేలా చేసి వాటి వ్యాప్తిని నియంత్రించవచ్చని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఎఫ్‌ఎంటీ వై. సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు సామూహికంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రైతులు, ఐసీఆర్‌పీలు పాల్గొన్నారు.