పద్మనాభంలో విద్యా కమిటీ ఎన్నికలలో కూటమి అభ్యర్థుల విజయభేరి
పద్మనాభం, సెప్టెంబర్ 29,మేజర్ న్యూస్:
పద్మనాభం మండలంలో ఈరోజు జరిగిన విద్యా కమిటీ ఎన్నికలలో కూటమి అభ్యర్థులు విజయ భేరి మోగించారు
దీనిలో భాగంగా బిజెపి అభ్యర్థులు గుంటుబోయిన గౌరీ చైర్మన్ ఎంపీపీ స్కూల్ పాత కొవ్వాడ గ్రామం,గొర్లె వెంకటలక్ష్మి చైర్మన్ ఎంపీపీ స్కూల్ పెంట గ్రామము,కోటి బోని అప్పలకొండ చైర్మన్ ఎంపీపీ స్కూల్, గొల్లల పాలెం ఈ సందర్భంగా గెలుపొందిన అభ్యర్థులకు అభినందన కార్యక్రమం పద్మనాభం బిజెపి కార్యాలయం ఆవరణలో మండల బిజెపి అధ్యక్షురాలు తమటపు నాగమణి ఆధ్వర్యంలో జరిగినది, కార్యక్రమంలో పద్మనాభం మండల పరిషత్ మాజీ అధ్యక్షులు దంతులూరి గోపాల కృష్ణమూర్తి రాజు ( గోపిరాజు ), మండల బిజెపి ఇన్చార్జ్ రూపాకుల రవికుమార్
మండల బిజెపి ఉపాధ్యక్షుడు పాలూరి కృష్ణారావు, కార్యదర్శి మరగడ గౌరీ రెడ్డి, అప్పలనాయుడు మొదలు వారు పాల్గొని అభినందించారు