పాతపట్నం షిర్డీగిరిలో ఘనంగా శ్రీ షిర్డీ సాయిబాబా 25వ శంఖుస్థాపన వార్షికోత్సవం!
పాతపట్నం అక్టోబర్ 2,మేజర్ న్యూస్:
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం షిర్డీగిరి శ్రీ షిర్డీ సాయిబాబా ధ్యానమందిరంలో శ్రీ షిర్డీ సాయిబాబా సేవాసంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న 25వ శంఖుస్థాపన వార్షికోత్సవం మరియు అఖండ సాయి నామ సంకీర్తన సప్తసప్తాహం వేడుకలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ షిర్డీ సాయిబాబా ధ్యానమందిరంలో డిసెంబర్ 03, 2026 శనివారం ఉదయం 6 గంటల నుండి నవంబర్ 21, 2026 శనివారం ఉదయం 6 గంటల వరకు అంటే దాదాపు 8వ పర్యాయంగా 7 వారాలు, 49 రోజులు, 1176 గంటల పాటు "ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి" నామ సంకీర్తన నిరంతరాయంగా జరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో భాగంగా నవంబర్ 21వ తేదీన సాయంత్రం 03.00 గంటలకు బాబా వారి చిత్రపటం ఊరేగింపు (పల్లకీసేవ) నిర్వహించబడుతుంది. అలాగే నవంబర్ 22వ తేదీ ఉదయం 09.00 గంటలకు శ్రీ గాయత్రి మహా యజ్ఞం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతుంది. నవంబర్ 23వ తేదీన ప్రముఖ గురుదేవులచే ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయి. మరియు అదే రోజు అంటే నవంబర్ 23, 2026 మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులందరికీ మహాన్నప్రసాదం వితరణ కార్యక్రమం ఉంటుందని శ్రీ షిర్డీ సాయిబాబా సేవాసంఘం, పాతపట్నం వారు తెలిపారు. కావున భక్తులందరూ ఈ దివ్య మహోత్సవానికి విచ్చేసి సాయిబాబా కృపకు పాత్రులుకావాలని కోరడమైనది.