BREAKING
10th class విద్యార్థికి లక్ష బహుమతి అంబేద్కర్ భవన్ నిర్మాణానికి స్థల పరిశీలన నాని ప్యారడైజ్ ప్రీమియర్ షోకు పోలీసుల నో.. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో భద్రతా కారణాల రీత్యా తిరస్కరణ రీ సర్వే పేరుతో భూమి కుదింపు.. రైతు ఆవేదన దామరచర్ల లోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్దకు చేరుకున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి,, మాజీ mla ల బృందం.. తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్‌కు ఘన సన్మానం. ఫేమస్ కాకముందే ఎక్కువ సంపాదించేదాన్ని.. ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్న కుమారి ఆంటీ స్కూల్ గేమ్స్ ప్రారంభం మదాఓఎలా యురేనియం ప్రాజెక్ట్‌లో వాటాను 40 శాతానికి పెంచుకున్న నైజర్ ప్రభుత్వం ఇంధన ధరలు పెరిగితే వడ్డీ రేట్లు మళ్లీ పెరిగే అవకాశం బిగ్‌బాస్ హౌస్‌లో మూడో వారమే భావోద్వేగాల ప్రవాహం.. కంటతడి పెట్టించిన పదహారవ ఎపిసోడ్ పెరుగుతున్న వ్యాపార విశ్వాసం జర్మనీ ఆర్థిక వృద్ధి అంచనాలను పెంచిన ప్రముఖ పరిశోధనా సంస్థలు తెలంగాణలో భూ అక్రమాలపై ప్రత్యేక విచారణ కమిటీ వంటనూనెల దిగుమతి సుంకం తగ్గించిన కేంద్రం

నంద్యాలలో ‘డా॥ శివాస్ డెంటోకేర్ ను ప్రారంభించిన రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్

Select Suryaa Now
నంద్యాలలో ‘డా॥ శివాస్ డెంటోకేర్ ను ప్రారంభించిన రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్

నంద్యాల అర్బన్: నంద్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో డాక్టర్ శివలక్ష్మి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక దంత వైద్యశాల డా॥ శివాస్ డెంటోకేర్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కత్తిరించి క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ నేటి జీవనశైలిలో దంత సంరక్షణ ఎంతో కీలకమని, ప్రజలందరూ నోటి ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ వహించాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అనుభవజ్ఞులైన వైద్యుల సేవలతో నంద్యాల ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన దంత వైద్య సేవలు అందించేందుకు డా॥ శివాస్ డెంటోకేర్ కృషి చేయాలని తెలిపారు . క్లినిక్ నిర్వాహకురాలు డాక్టర్ శివలక్ష్మిని అభినందిస్తూ, వారి వైద్య సేవలు మరింత విస్తరించాలని కోరారు. అనంతరం డాక్టర్ శివలక్ష్మి మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలతో అనుభవజ్ఞులైన వైద్య బృందం ద్వారా అన్ని రకాల దంత సమస్యలకు మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్‌ గారికి, ఇతర ప్రముఖులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, నరేంద్ర కుమార్ రెడ్డి, అశోక్ కుమార్ రెడ్డి, సంజీవ కుమార్ రెడ్డి, షాకీర్, నంద్యాల టిడిపి ఆఫీస్ సెక్రటరీ రాజేష్ (బుజ్జి) మరియు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖ వైద్యులు, స్థానిక నాయకులు, శ్రేయోభిలాషులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.