BREAKING
10th class విద్యార్థికి లక్ష బహుమతి అంబేద్కర్ భవన్ నిర్మాణానికి స్థల పరిశీలన నాని ప్యారడైజ్ ప్రీమియర్ షోకు పోలీసుల నో.. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో భద్రతా కారణాల రీత్యా తిరస్కరణ రీ సర్వే పేరుతో భూమి కుదింపు.. రైతు ఆవేదన దామరచర్ల లోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్దకు చేరుకున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి,, మాజీ mla ల బృందం.. తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్‌కు ఘన సన్మానం. ఫేమస్ కాకముందే ఎక్కువ సంపాదించేదాన్ని.. ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్న కుమారి ఆంటీ స్కూల్ గేమ్స్ ప్రారంభం మదాఓఎలా యురేనియం ప్రాజెక్ట్‌లో వాటాను 40 శాతానికి పెంచుకున్న నైజర్ ప్రభుత్వం ఇంధన ధరలు పెరిగితే వడ్డీ రేట్లు మళ్లీ పెరిగే అవకాశం బిగ్‌బాస్ హౌస్‌లో మూడో వారమే భావోద్వేగాల ప్రవాహం.. కంటతడి పెట్టించిన పదహారవ ఎపిసోడ్ పెరుగుతున్న వ్యాపార విశ్వాసం జర్మనీ ఆర్థిక వృద్ధి అంచనాలను పెంచిన ప్రముఖ పరిశోధనా సంస్థలు తెలంగాణలో భూ అక్రమాలపై ప్రత్యేక విచారణ కమిటీ వంటనూనెల దిగుమతి సుంకం తగ్గించిన కేంద్రం

జిమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే గిడ్డి

Select Suryaa Now
జిమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే  గిడ్డి

పి.గన్నవరం. మేజర్ న్యూస్ :పి.గన్నవరం మండలంలోని ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ వెనుక భాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన వజ్ర జిమ్‌ను పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ  ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ యువత ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిత్యం వ్యాయామం చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కూడా కలుగుతుందని తెలిపారు. యువత క్రీడలు, వ్యాయామం వైపు ఆసక్తి పెంచుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

జిమ్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, యువతకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించే ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.