నరసరావుపేటలో పోలీసుల ఫ్లాగ్‌మార్చ్
నరసరావుపేట : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పట్టణం లో పోలీసులు అదనపు బలగాలతో శనివారం ఫ్లాగ్‌మార్చ్ నిర్వహిం చారు. పల్నాడు జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదహళ్లి ఆదేశాల మేరకు ఏఎస్పీ ఎం.హనుమంత రావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేపట్టా రు. రైల్వేస్టేషన్ సమీపంలోని ఫస్ట్‌గేట్ వద్ద ప్రారంభమైన ఫ్లాగ్‌మార్చ్ ఆర్డీవో కార్యాల యం, క్లాక్‌టవర్, మల్లమ్మ సెంటర్ మీదుగా కోట సెంటర్ వరకు సాగింది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా, ప్రజల్లో భద్రతాభావం కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని సూచించారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియో గించుకునేలా పటిష్ఠ భద్రతా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి..