BREAKING
టీనేజర్ల భద్రత కోసం వాట్సాప్ కీలక ఫీచర్: ఐచ్ఛిక ‘పేరెంటల్ కంట్రోల్స్’ ప్రవేశపెట్టిన మెటా ట్రంప్-మోదీ ఫోన్ సంభాషణ ‘అద్భుతం’: భారత్-అమెరికా బంధంపై అమెరికా రాయబారి ప్రశంసలు వినియోగదారులపై ధరల భారం: ఇండోర్‌లో నేటి నుంచి లీటరు పాలకు ₹3 పెంపు! జీ20 సదస్సు వేళ భారత్-పోలండ్ ద్వైపాక్షిక భేటీ: వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణపై పీయూష్ గోయల్ కీలక చర్చలు భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు సౌదీలో చికిత్స 'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి

నలపరెడ్డిపల్లి–మురగళ్ల–కనుపూరుపల్లి రహదారి పనులు ప్రారంభించాలి

Select Suryaa Now
నలపరెడ్డిపల్లి–మురగళ్ల–కనుపూరుపల్లి రహదారి పనులు ప్రారంభించాలి

నెల్లూరు కలెక్టరేట్ (మేజర్ న్యూస్)  :  ఆత్మకూరు మండలంలోని నలపరెడ్డిపల్లి–మురగళ్ల–కనుపూరుపల్లి గ్రామాలను కలిపే ప్రధాన రహదారి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు తోడేటి అశోక్ కోరారు.  ఈ మేరకు బుధవారం నెల్లూరు కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లును కలిసి వినతిపత్రం అందజేశారు. మూడు గ్రామాల ప్రజలతో కలిసి సేకరించిన సంతకాల పత్రాలను కూడా జాయింట్ కలెక్టర్‌కు అందించారు.  రహదారి అధ్వానంగా ఉండటంతో విద్యార్థులు, రైతులు, మహిళలు, వృద్ధులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అశోక్ తెలిపారు. రహదారి నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయి రెండు నెలలు గడిచినా పనులు ప్రారంభం కాలేదని పేర్కొన్నారు.  ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపు పనులను ప్రారంభించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన జాయింట్ కలెక్టర్‌ను కోరారు. ప్రజల సమస్యను పరిశీలించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.