నగరంలోని ఎర్రనేల కొట్టాలలో ఘనంగా గాంధీ జయంతి
అనంతపురం నగరంలోని ఒకటవ డివిజన్ పరిధిలో ఉన్న ఎర్రనేల కొట్టాలలో శుక్రవారం ఉదయం ఘనంగా గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులతో కలిసి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
మాజీ కార్పొరేటర్ లాలూ సాబ్ నేతృత్వంలో కార్యక్రమాన్ని నిర్వహించి గాంధీ జయంతి సందర్భంగా స్వాతంత్ర సమరయోధులలో గొప్ప మహనీయుడిగా ఆయన దేశానికి స్వాతంత్రం అందించిన తీరు గురించి వివరించారు. ప్రతి ఏటా గాంధీ జయంతి అత్యంత ఘనంగా ఎర్రనేల కొట్టాలలో నిర్వహించడం ఆనవాయితీగా మారిందని వారు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కార్మికులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.