BREAKING
పల్లె ప్రగతికి కూటమి ప్రభుత్వం పెద్దపీట.. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన రెయిన్వి బో ద్యార్థులు సీఎం సిరిసిల్ల సభను విజయవంతం చేయండి ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గుండెను కాపాడుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి.. జిల్లా కలెక్టర్ అంకిత్ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డికి వినతి పత్రం ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్‌లో ఏపీకి దేశంలోనే ప్రథమ స్థానం: సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు ప్రదానం ఉత్కంఠ భరితంగా విద్య కమిటీ ఎన్నికలు రూ.20 వేల కోట్లతో హార్టీకల్చర్ హబ్: వెలుగొండ ఆధారిత ప్రాంతాలకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం గ్రామ, వార్డు సచివాలయ ఏఎన్ఎం ల సమస్యలపై గళం విప్పిన వైద్య ఉద్యోగుల సంఘ నేత ఆస్కార్ రావు ఐఎంఏ ఆధ్వర్యంలో 25వ రక్తదాన శిబిరం చంద్రబాబు నాయకత్వంలోనే వెలుగొండకు జలకళ: మంత్రి నిమ్మల రామానాయుడు కార్మికులపై పెరుగుతున్న పని ఒత్తిడి సమస్యల పరిష్కారం కోసం వినతి వెలుగొండతో ఉదయగిరి బత్తాయి తోటలకు జలకళ: ఈస్టర్న్ మెయిన్ కెనాల్ ద్వారా రైతులకు భరోసా

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

Select Suryaa Now
మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

18 ఏళ్ల డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం

- నగరంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

- ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

- 33వ డివిజన్‌లో రూ.72 లక్షలతో ఫుట్‌పాత్ పనులకు శంకుస్థాపన

 రాజమహేంద్రవరం :

నగర ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, రోడ్లు, నీటిముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 33వ డివిజన్ పరిధిలోని సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద రూ.72 లక్షలతో ఇంటర్‌లాకింగ్ టైల్స్‌తో ఫుట్‌పాత్ ఏర్పాటు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ 33వ డివిజన్‌లోని ఈ ప్రాంత ప్రజలు గత 18 ఏళ్లుగా డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షపు నీరు, మురుగునీరు రోడ్లపై ప్రవహించే పరిస్థితి ఉందని, ఈ సమస్యను గుర్తించి రోడ్డు ఇరువైపులా డ్రైనేజీల నిర్మాణ బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నగరానికి అవసరమైన కనీస మౌలిక వసతులను కల్పించకుండా కేవలం సుందరీకరణ పనులకు ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. ప్రజలకు అవసరమైన రోడ్లు, డ్రైనేజీలు, లైట్లు, పార్కులు వంటి మౌలిక వసతులపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పరిస్థితులను స్వయంగా పరిశీలించామని, గత రెండేళ్లలో చేపట్టిన పనుల ఫలితంగా అనేక ప్రాంతాల్లో నీటిముంపు సమస్య తగ్గిందని తెలిపారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం చూపించాల్సి ఉందన్నారు. రామచంద్రరావుపేట–కంబాలచెరువు ప్రాంతాల్లో నీటిముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సుమారు రూ.25 కోట్లతో మేజర్ డ్రైన్ నిర్మాణాన్ని చేపడుతున్నామని వెల్లడించారు. ఈ డ్రైన్ పూర్తయితే కంబాలచెరువు పరిసర ప్రాంతాలు, ఇన్‌కమ్ ట్యాక్స్ కార్యాలయం వైపు, రామచంద్రరావుపేట తదితర ప్రాంతాల్లో నీటిముంపు సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. హైటెక్ బస్టాండ్ సమీపంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న నీటిముంపు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామని ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. పబ్లిక్ హెల్త్ విభాగం నుంచి రూ.6 కోట్లకు టెండర్ కేటాయింపు పూర్తయిందని, కార్పొరేషన్ తరఫున మరో రూ.2 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మొత్తంగా రూ.8 కోట్లతో డ్రైనేజీ నిర్మాణాన్ని చేపడుతున్నామని, అక్టోబర్ మూడో వారంలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. పనులు వేగంగా జరిగితే రెండున్నర నెలల్లోనే డ్రైనేజీ నిర్మాణాన్ని పూర్తి చేసి హైటెక్ బస్టాండ్ పరిసరాల్లో నీటిముంపు సమస్యకు పరిష్కారం చూపిస్తామని అన్నారు. నగరంలో ఇంకా పరిష్కరించాల్సిన నీటిముంపు ప్రాంతాలు ఉన్నాయని, మార్కెట్ యార్డు, ఆర్‌టీఓ కార్యాలయం, కంబాలచెరువు, హైటెక్ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో అవసరమైన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. రాబోయే ఏడాది లోపల నగరానికి అవసరమైన కనీస మౌలిక వసతులైన రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, పార్కులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, నగర పాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.