మహాలక్ష్మి గా కనకమహాలక్ష్మి దర్శనం!
విశాఖపట్నం, సూర్య : దసరా మహోత్సవాలు పురస్కరించుకొని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు ఆలయంలో తొమ్మిది రోజులుగా శరన్నవరాత్రి పూజలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. వివిధ రూపాల అలంకరణలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చి అలరిస్తున్నారు. సోమవారం 9వ రోజున మహాలక్ష్మి గా కనకమహాలక్ష్మి అమ్మవారు అలంకరణ తో భక్తులకు దర్శనమిచ్చారు. పలు రకాల కూరగాయలతో అమ్మవారికి అలంకరించి శాఖంబరి గా పూజలు అర్చకులు, పండితులు చేశారు. అలంకరణకు ఉభయ దాతలుగా నరేష్ కుమార్ వ్యవహరించారు. అలంకరణ చీరలను సౌత్ ఇండియా షాపింగ్ మా ల్, లక్కీ మాల్ అధినేతలు అందజేశారు. అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అన్న వితరణ భవనంలో ఉచిత అన్న ప్రసాదానికి టు లైన్ లన్నీ భక్తులతో బారులు తీరాయి. సాయంత్రం అమ్మవారి పంచామృతాభిషేకం సేవలను యధాతధంగా అర్చకులు నిర్వహించారు. ప్రత్యేకపూజల కోసం భక్తులు ఎప్పటిలాగే ఆలయానికి వచ్చి పూజలు చేయించుకున్నారు విజయదశమి పర్వతనాన్ని పురస్కరించుకొని మంగళవారం ఆలయంలో అమ్మవారు దర్శనాలు యధాతధంగా జరగనున్నాయని అధికారిక వర్గాలు తెలిపాయి.
రిపోర్టర్ : సత్యనారాయణ, ఒన్‌టౌన్, విశాఖపట్నం.