BREAKING
ఫ్లైదుబాయ్ విమానంలో పైలట్ల మధ్య ఘర్షణ: ధైర్యసాహసాలు చూపిన భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు సౌదీలో చికిత్స 'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన

మాకవరపాలెం మండలంలో పలు విద్యా కమిటీలు ఏకగ్రీవం

Select Suryaa Now
మాకవరపాలెం మండలంలో పలు విద్యా కమిటీలు ఏకగ్రీవం

 

మాకవరపాలెం, సెప్టెంబర్ 29, మేజర్ న్యూస్:

మాకవరపాలెం మండలంలోని పలు పాఠశాలల్లో విద్యా కమిటీ ఎన్నికలు జరిగాయి. కొన్ని పాఠశాలల్లో టీడీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మరికొన్ని చోట్ల పోటీతో ఎన్నికలు జరిగాయి. మాకవరపాలెం మండల కేంద్రంలోని పాఠశాల విద్యా కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. తామరం గ్రామానికి చెందిన కోసూరు వెంకటలక్ష్మి చైర్మన్‌గా, మాకవరపాలెం పెద్దపల్లికి చెందిన మాణిక్యాలరావు వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కమిటీ టీడీపీ మద్దతుదారుల ఆధ్వర్యంలో ఏర్పడింది. ముసిడిపాలెం పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల్లో టీడీపీ మద్దతు అభ్యర్థులు విజయం సాధించారు. చైర్మన్‌గా ఇసం శెట్టి అప్పలకొండ, వైస్ చైర్మన్‌గా కళ్లెంపూడి సత్యవేణి ఎన్నికయ్యారు. బుచ్చన్నపాలెం ఎంపీపీ పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్‌గా రుత్తల శిరీష, వైస్ చైర్మన్‌గా దేవాడ రాజేశ్వరి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలు మండల మహిళా అధ్యక్షురాలు రుత్తల రమణమ్మ ఆధ్వర్యంలో జరిగాయి. నూతన కమిటీ సభ్యులను పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు.  రాచపల్లి పంచాయతీ శివారు గ్రామమైన ఎర్రకన్నపాలెం పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పదవిని టీడీపీ మద్దతుదారు దక్కించుకున్నారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్‌కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు. రామన్నపాలెం పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌గా మునూరు బాల, వైస్ చైర్మన్‌గా కొరుప్రోలు వెంకి నాయుడు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో టీడీపీ మాజీ సర్పంచ్ చుక్కా పోతురాజు, యాక రాము, అడిగర్ల శ్రీనుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాచపల్లి గ్రామంలోని పాఠశాల స్కూల్ కమిటీ ఎన్నికల్లో పెట్ల భద్రాచలం, పెట్ల వరహాలు దొర బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. చైర్మన్‌గా మడక రామకృష్ణ, వైస్ చైర్మన్‌గా అచ్చర్ల విజయ ఎన్నికయ్యారు. వారి విజయంతో అనుచరులు, మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు. రాచపల్లి, కొత్తపాలెం గ్రామాల్లో జరిగిన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికల్లో వైసీపీకి చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో రాచపల్లి పంచాయతీ పరిధిలోని పాఠశాలల్లో వరుసగా వైసీపీ మద్దతు అభ్యర్థులు గెలవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అయితే విద్యా కమిటీ ఎన్నికలు తల్లిదండ్రులు, సభ్యుల ఓటింగ్ ఆధారంగా జరగడంతో ఫలితాలను రాజకీయ ప్రభావంతో మాత్రమే చూడాలా అనే అంశంపై స్థానికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి