BREAKING
మహబూబాబాద్ కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు నేటి నుండి పాఠశాలలకు సెలవులు ఐచీ-నగోయా ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత్ నేడు దస్తగిరి స్వామి గ్యార్మీ వేడుకలు ఫిఫా అంతర్జాతీయ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో స్పెయిన్ దూకుడు అద్దంకిలో తాగునీటి సరఫరా వేళల్లో మార్పులు. నెట్‌ఫ్లిక్స్‌లో పరిణీతి చోప్రా ‘రిపోర్టింగ్ లైవ్’ మూవీ రివ్యూ.. కథ బాగున్నా థ్రిల్ మిస్ అయిందా? మానసిక ఆరోగ్యంపై రాజమహేంద్రవరం జీఎంసీలో అవగాహన సదస్సు, ర్యాలీ ప్రజాసేవ నుంచి పంచాయతీ పీఠం దిశగా ఏలూరి మాధవరావు బీసీల రాజకీయ ప్రయోజనాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు: 34% రిజర్వేషన్ల కంటే ఎక్కువే ఇచ్చి గెలిపించుకుంటాం! వైసీపీ గుర్తింపు కార్డుల పేరుతో కార్యకర్తలను మోసం చేస్తున్నారు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై బండి పరశురామ్ విమర్శలు బీసీలకు జరిగిన అన్యాయంపై జగన్ సమాధానం చెప్పాలి 34 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై వైసీపీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ జిల్లా కలెక్టరేట్‌లో దిశ కమిటీ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నోయిడా జేవర్ ఎయిర్‌పోర్ట్‌కు నరేంద్ర మోదీ పేరు: యూపీ కేబినెట్ కీలక నిర్ణయం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించాలని రైతుల విజ్ఞప్తి.

మాజీ IAS అధికారి కృష్ణయ్య అన్న కుమారుడు పైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి నల్లపరెడ్డి..

Select Suryaa Now
మాజీ IAS అధికారి కృష్ణయ్య అన్న కుమారుడు పైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  కు ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి నల్లపరెడ్డి..

కొడవలూరు , మేజర్ న్యూస్ :  కొడవలూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెసెంజర్‌గా విధులు నిర్వహిస్తున్న పిర్రల అజయ్ బాబుపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ, మాజీ మంత్రివర్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ పాల్యా మురళి నాయక్ గారికి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు వీరి చలపతిరావు గారు పాల్గొన్నారు..   వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 1వ తేదీన కొడవలూరు మండలం వెంకన్నపురంలోని ఎంపీపీ పాఠశాలలో జరిగిన ఎన్నికల సందర్భంగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ దౌర్జన్యానికి పాల్పడి, ఎస్సీ మహిళ దారా ప్రియాంకపై దాడి చేసిన కేసులో పిర్రల అజయ్ బాబు నిందితుడిగా ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.  అదే రోజు బ్యాంకులో విధులకు హాజరైనట్లు నమోదు చేయించుకుని, అదే సమయంలో వెంకన్నపురం పాఠశాల ఎన్నికల సందర్భంగా దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. బ్యాంకులో ఆయన విధుల నిర్వహణ, హాజరు నమోదు అంశాలతో పాటు, బ్యాంకులో చోటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్న అవకతవకలు, అవినీతిపై సమగ్ర విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని రీజినల్ మేనేజర్‌ను నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు కోరారు.  ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని ఆయన విజ్ఞప్తి చేశారు..