BREAKING
గుండె స్టెంట్ల భద్రతపై ఆందోళన! నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైన నాని 'ది ప్యారడైజ్'.. డేట్ లాక్! రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి. • నడిపెల్లి విజిత్‌ కుమార్‌ హీరోగా మారిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. 'డెస్టినీ' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల విషాదం.. 'కప్పి స్క్వాడ్' వెబ్ సిరీస్ దర్శకుడు బేల్‌రాజ్ కలరిక్కల్ హఠాన్మరణం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక.. 'రణబాలి' సక్సెస్‌పై జోరుగా స్పందన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా సాయి పటేల్ 'ఐ హేట్ మ్యారేజ్' టీజర్ విడుదల.. నేటి Gen Z ఆలోచనలతో ఆకట్టుకుంటున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. వరుసగా నాలుగు రోజుల సెలవులు! ఎన్నికల విధుల్లో ఉన్నవారికి మాత్రం మినహాయింపు లేదు యూట్యూబ్ సెన్సేషన్ అజయ్ హీరోగా కొత్త సినిమా షురూ.. ఘనంగా ప్రారంభోత్సవం హైకూ' మనల్ని కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సిన్సియర్ లవ్ స్టోరి: కోన వెంకట్ మహాలక్ష్మి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు వైకాపా ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి

మా మద్దతు రమేష్ గౌడన్నకే.. - అనంతపురం అభివృద్ధి వైసిపి మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌తోనే సాధ్యం - మీడియాతో ఐక్య విద్యార్థి సంఘాల నేతలు

Select Suryaa Now
మా మద్దతు రమేష్ గౌడన్నకే..  - అనంతపురం అభివృద్ధి వైసిపి మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌తోనే సాధ్యం  - మీడియాతో ఐక్య విద్యార్థి సంఘాల నేతలు

అనంతపురం బ్యూరో  : అనంతపురం నగర పాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీ రమేష్ గౌడ్ విజయాన్ని ఆకాంక్షిస్తూ శనివారం నగరంలోని  ఐక్య విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మీడియా పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థి, యువజన సంఘాల ఏఐఎస్‌బీ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డిపల్లి పృథ్వి, పీఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఆలం, పీఎస్‌యూ అధ్యక్షులు మంజుల నరేంద్ర, ఏఐఎస్‌పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహ, ఏఐఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్, యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భీమేష్, ఏఐఎస్‌బీ జిల్లా కార్యదర్శి పోతులయ్య, పీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రతిభ భారతిలు మాట్లాడుతూ.. రమేష్ గౌడ్‌కి తమ పూర్తి మద్దతును ప్రకటిస్తున్నట్లు బహిరంగంగా వెల్లడించారు. గత 20 సంవత్సరాల నుంచి నగరంలో విద్యార్థుల సమస్యలపై, విద్యా రంగ అభివృద్ధిపై ఎల్లప్పుడూ స్పందించే గుణం రమేష్ గౌడ్‌కి సొంతమని కొనియాడారు. విద్యార్థులు, యువత సమస్యలను పరిష్కరించడంలో ఆయన ముందుంటారని, నగరంలో విద్యా వసతుల మెరుగుదలకు, యువతకు మెరుగైన భవిష్యత్తును అందించడానికి ఆయన వద్ద స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. నగరంలో ఉన్న మౌలిక వసతుల కల్పన, డ్రైనేజీ వ్యవస్థల పునర్నిర్మాణం, సురక్షిత తాగునీరు, నగర సౌందర్యీకరణ వంటి అంశాలలో రమేష్ గౌడ్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ఒక సమర్థుడైన, నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు మేయర్ పీఠాన్ని అధిరోహిస్తేనే అనంతపురం నగరం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. బీసీ రమేష్ గౌడ్‌ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అనంతపురం నగర ప్రజలు, ముఖ్యంగా విద్యార్థి లోకం, నిరుద్యోగ యువత అంతా ఐకమత్యంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌కి మీ అమూల్యమైన ఓటు వేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు సాహిత్, వినోద్, దామో తదితరులు పాల్గొన్నారు.