BREAKING
భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు సౌదీలో చికిత్స 'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన

మా ఇంట్లో మొత్తం 16 ఓట్లు ఉన్నాయి.. అవన్నీ బాస్ (జనసేన)కే”

Select Suryaa Now
మా ఇంట్లో మొత్తం 16 ఓట్లు ఉన్నాయి.. అవన్నీ బాస్ (జనసేన)కే”

మరో ఇంట టీడీపీ సభ్యత్వ కార్డు చూపుతూ స్థానిక (16)21 వ డివిజన్ లో స్పష్టమైన మద్దతు పలుకుతున్నాయి…విజయలక్ష్మి గునుకుల-జనసేన

నెల్లూరు సిటీ మేజర్ న్యూస్  :   పాత 16, కొత్త 21వ డివిజన్‌లో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, గునుకుల విజయలక్ష్మి ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కొనసాగుతున్న ప్రచారం ఈరోజు కూడా యథావిధిగా కొనసాగింది. ఈ సందర్భంగా స్థానిక కుటుంబాలతో మమేకమై ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.ప్రచారంలో స్థానికులు జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పారదర్శక పాలన, ప్రజా సంక్షేమంపై దృష్టి గురించి చర్చించారు. అలాగే ‘పల్లె పండుగ 3.0’ ద్వారా భారీ స్థాయిలో గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడాన్ని కూటమి ప్రభుత్వ అభివృద్ధి ప్రాధాన్యతకు నిదర్శనంగా పేర్కొన్నారు.నెల్లూరు సిటీని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దే దిశగా, నగరాభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదలతో పాటు అమరావతి నిర్మాణంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పురపాలక శాఖ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే శ్రీ పొంగూరు నారాయణ గారి కార్యక్రమాలపై కూడా ప్రచారంలో వివరించారు.అదేవిధంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు విజన్, దీర్ఘకాలిక అభివృద్ధి ఆలోచన,దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని,కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రానికి అందుతున్న సహకారం గురించి కూడా స్థానికులతో చర్చించారు.కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమం, సమపాలనకు మద్దతుగా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి తరఫున ఎవరు అభ్యర్థులుగా నిలిచినా వారికి తమ మద్దతు ఉంటుందని, అభివృద్ధి కొనసాగేందుకు తామంతా కూటమి అభ్యర్థులను గెలిపిస్తామని తెలీపారు.ఈ ప్రచార కార్యక్రమంలో గునుకుల విజయలక్ష్మితో పాటు కుమారి, విజయ, ప్రవల్లిక, ప్రశాంతి, సుప్రియ, బాలాజీ, ఆమని తదితరులు పాల్గొన్నారు.