లేఔట్లకు ప్లాన్ అప్రూవల్ తప్పనిసరి
*లేఅవుట్లకు ప్లాన్ అప్రూవల్ తప్పనిసరి*
*కమిషనర్ రాహుల్ మీనా*
రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో అన్ని లేఅవుట్లకు ప్లాన్ అనుమతులు తప్పనిసరిగా ఉండాలని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. మంగళవారం ఉదయం పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. గాదాలమ్మనగర్లో పలు లేఅవుట్లను పరిశీలించారు. ఎక్కడ ప్లాన్ అప్రూవల్ లేకుండా నిర్మాణాలు జరగకూడదని టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు. ముఖ్యంగా రోడ్లు, కాలువలు, నీటి సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతనే లేఅవుట్లలో నిర్మాణాలు జరగాలన్నారు. అలాగే అనధికార లేఅవుట్లలో నిర్మాణాలు చేపట్టే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు కూడా మోసాలకు గురికాకుండా ఉండటానికి అన్ని అనుమతులు ఉన్న ప్రాజెక్టుల్లోనే స్థలాలను కొనుగోలు చేయాలని.. తక్కువ ధరకు ఇచ్చారనో, ఆఫర్లలో వచ్చిందనో కొంటే తర్వాత ఇబ్బందులు పడతారన్నారు. ఆయన వెంట సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఏసీపీ కొండలరావు, ఇతర టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉన్నారు.