కూటమిలో తేలని అభ్యర్థుల ఎంపిక
పూసపాటిరేగ, సూర్య : పూసపాటిరేగ మండల అధ్యక్ష పీఠంతోపాటు జడ్పిటిసి స్థానంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. నెల్లిమర్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రయత్నించు వహిస్తున్న జనసేన పార్టీకి చెందిన లోకం నాగ మాధవి అధ్యక్ష పీఠం తో పాటు జడ్పిటిసి స్థానం కూడా తన అనుచరులకు దక్కించుకునే విధంగా ముమ్మర ప్రయత్నాలను చేస్తున్నారు. మరోవైపు తేదేపాకు చెందిన సీనియర్ నాయకులు కూడా అదే స్థాయిలో ప్రయత్నాలను సాగిస్తున్నారు. ఇప్పటికే నెల్లిమర్ల నగర పంచాయతీ చైర్మన్ విషయంలో కూటమిలో ఉన్న ఇరు పార్టీలకు చెందినవారు పోటీపడి చివరికి భాజపాకు చేజారిపోవడంతో ఇటు జనసేన పార్టీతో పాటు పట్టు తెలుగు తమ్ముళ్లు కూడా భంగపడ్డారు. దీనితో పూసపాటిరేగ మండల అధ్యక్ష పీఠంపై మీరు పార్టీలకు చెందిన వారు తమదంటే తమదే అని పోటీ తారస్థాయికి చేరడంతో అధిష్టానం నుంచి ఎటువంటి సంకేతాలు రాకపోవడంతో ఇరు పార్టీలో ఉన్న నాయకుల్లో గుబులు మొదలైంది. జనసేన తరఫున మొదటి నుంచి అధ్యక్ష పీఠం వస్తుందని ఆశించిన కోట్ల రఘు అదే స్థాయిలో పలు సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేశారు. మరి తెదేపాలో మొదట్నుంచి అధ్యక్ష పీఠంతోపాటు జడ్పిటిసి స్థానం కూడా పొందుతూ వస్తున్న తెలుగు తమ్ముళ్లు 2021లో తెదేపా అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరించి మరి పోటీ చేసి వైకాపా చేతిలో ఓటమి పొందారు. ఓటమి పొందిన స్థానంలోనే గెలుపు సాధించాలంటే మరోసారి అవకాశం కల్పించాలంటూ తాజాగా జిల్లా పార్టీ అధ్యక్షుడు నాగార్జున సమక్షంలో పూసపాటిరేగలో నిర్వహించిన పార్టీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్లు తమ అభిప్రాయాన్ని శుక్రవారం వ్యక్తం చేశారు. ఎటు తేల్చుకోలేని కూటమి నాయకులు అశోక్ బంగ్లాలో కూటమి లో ఉన్న ఇరు పార్టీలకు చెందిన నాయకులను పిలిపించి రాజీ కుదిరిచ్చే ప్రయత్నం చేస్తారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. సమస్త మరీ తీవ్రంగా ఉండడంతో ఆదివారం వరకు అధ్యక్షుపీఠంతోపాటు జడ్పిటిసి స్థానాలపై ఓ నిర్ణయం వచ్చే అవకాశం ఉందని ఆశావాహులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైకాపాలు కూడా అధ్యక్ష పీఠం తో పాటు జడ్పిటిసి స్థానంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. జడ్పిటిసి స్థానంపై శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు కుమారుడైన చైతన్య బరిలోకి దిగుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. చైతన్య కూడా జడ్పీ చైర్మన్ రేస్ లో ఉన్నారంటూ ప్రచారం కావడంతో మండలంలో రాజకీయాలు మరి రసవత్తరంగా మారాయి. మరి అధ్యక్ష పీఠం ఎంపిక తో పాటు జడ్పిటిసి స్థానం పార్టీలు ఎవరిని ఎంపిక చేస్తాయో వేచి చూడాల్సిందే మరి.
రిపోర్టర్ : రమేష్, పూసపాటిరేగ, విజయనగరం జిల్లా.