కూటమి నాయకులు ఆధ్వర్యంలో తుపాన్ బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ
సాగర్ నగర్: సెప్టెంబర్ 29: మేజర్ న్యూస్: జీవీఎంసీ భీమిలి నియోజకవర్గం నూతన 11వ వార్డు పరిధిలోని ఋషికొండ గ్రామంలో అర్నాబ్ తుపాన్ ప్రభావంతో బురద నీరు ఇళ్లలోకి చేరి ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబాలను జనసేన పార్టీ నాయకులు శాఖరి శ్రీనివాస్ పరామర్శించారు.
ఈ సందర్భంగా తుపాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీ లక్ష్మణ్ కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి నిత్యావసర సరుకులను అందజేశారు. భవిష్యత్తులో ఏవైనా సహాయం అవసరమైతే వెంటనే తమను సంప్రదించాలని, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని శాఖరి శ్రీనివాస్ భరోసా కల్పించారు. కార్యక్రమంలో టీడీపీ 9వార్డు మాజీ అధ్యక్షులు శ్రీ అక్కరబోని రాంబాబు, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు గద్దిపిల్లి అప్పలరాజు, మహిళా కోఆర్డినేటర్ సీరం ధనరత్నం, కూటమి నాయకులు ధనరాజు, చిన్నారావు, కృష్ణకుమార్, లక్ష్మణ్, అప్పన్న , కోదండ, శైలేష్ పాల్గొన్నారు.