BREAKING
ఓర్వకల్లులో తొలిరోజు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల సందడి మూడు ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు.. జడ్పీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థి దాఖలు తన చిన్ననాటి స్నేహితురాలితో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ పెళ్లి? టాలీవుడ్‌లో వైరల్ అవుతున్న వార్తలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ దసరా కానుకగా మున్సిపల్ చైర్మన్ కార్మికులకు దుస్తుల పంపిణీ పెడన మండల జడ్పిటిసి కూటమి ప్రభుత్వ అభ్యర్థిగా కాగితలక్ష్మి. ముండ్లమూరు మండల ఓటర్లు 45 605. నేడు గంగమ్మ ఆలయంలో బహిరంగ వేలం పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి రణబాలి 2 సినిమా ఉంటుందా దర్శకుడు ఏమన్నారంటే టాలీవుడ్‌లో వైరల్ అవుతున్న అప్‌డేట్ టిడిపి వల్లూరు ఎంపీటీసీ అభ్యర్థిగా సువ్వాడ వనజాక్షి నామినేషన్ దాఖలు దాడులు, బెదిరింపులకు భయపడం: కాకాణి రాజకీయ అనుభవమే బలం బలగం డైరెక్టర్ వేణు యల్దండికి ఆ సెంటిమెంట్ కలిసి వస్తుందా టాలీవుడ్‌లో జోరుగా చర్చ ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ నమ్మకాన్ని నిరూపించిన అలిపిరి ఎస్సై

కూటమి అభ్యర్థులకు విజయం చేకూర్చాలి -టిడిపి పరిశీలకులు మోహన్ రెడ్డి

Select Suryaa Now
కూటమి అభ్యర్థులకు విజయం చేకూర్చాలి -టిడిపి పరిశీలకులు మోహన్ రెడ్డి

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :  ఆత్మకూరునియోజకవర్గంలో రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మరియు ఎంపీపీ ఎన్నికల్లో కూటమి (టీడీపీ జనసేన, బిజెపి ) అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర కార్యదర్శి శనివారపు మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆత్మకూరు నియోజకవర్గంలో రాజకీయ సందడి ఊపందుకుంది. రాబోయే జెడ్పీటీసీ,ఎంపీటీసీ, మరియు ఎంపీపీ  ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం కోసం నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర కార్యదర్శి శనివారపు మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో టికెట్లు ఎవరికి కేటాయించినప్పటికీ, పార్టీ శ్రేణుల మధ్య ఎలాంటి మనస్పర్ధలు, విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సారథ్యంలో నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆయన కష్టానికి ప్రతిఫలంగా ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి ఆనం రుణం తీర్చుకోవాలని మోహన్ రెడ్డి ప్రజలను, కార్యకర్తలను కోరారు. ఇటీవలే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో ఎన్నికల వ్యూహాలపై కీలక సమావేశాలు జరిగాయి. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆత్మకూరు నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధిని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే కోట్లాది రూపాయల నిధులతో మళ్లీ పట్టాలెక్కించామని నాయకులు గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా వాయుపుత్ర మార్గ్ బైపాస్ రహదారి వంటి కీలక మౌలిక వసతుల కల్పనతో ఆత్మకూరు రూపురేఖలు మారుతున్నాయని వివరించారు.  రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సారథ్యంలో నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆయన కష్టానికి ప్రతిఫలంగా కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన అభివృద్ధిని, కూటమి ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే కోట్లాది రూపాయల నిధులతో మళ్లీ పట్టాలెక్కించామని నాయకులు పేర్కొన్నారు. ముఖ్యంగా వాయుపుత్ర మార్గ్ బైపాస్ రహదారి వంటి కీలక మౌలిక వసతుల కల్పనను ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఓటర్లను కలిసి, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని మోహన్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు.