కొండకర్ల పిఎసిఎస్ అధ్యక్షులు గొంతున సాయిరాం సమీక్షంలో మహాజనసభ
అచ్చుతాపురం, సెప్టెంబర్30, మేజర్ న్యూస్ : కొండకర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నందు తే.30-09-2026 దిన బుధవారం ఉదయం 11 గంటలకు సంఘ అధ్యక్షులు గొంతిన భక్త సాయి రామ్ అధ్యక్షతన కొండకర్ల పి ఏ సి ఎస్ భవన ప్రాంగణము నందు మహాజనసభ నిర్వహించడం జరిగినది. అధ్యక్షులు వారు మాట్లాడుతూ రాబోయే (2026-27) ఆర్థిక సంవత్సరానకి అంచనా బడ్జెట్ ను ప్రవేశపెట్టి చర్చించడమైనది మరియు తే.30-09-2026 వరకు జరిపిన జమా ఖర్చులను ఆమోదించడం జరిగినది. ఆప్కాబ్ మరియు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ విశాఖపట్నం వారి ఆర్థిక సహకారంతో సి డి ఎఫ్ నిధులు ద్వారా కొండకర్ల పి ఏ సి ఎస్ భవన మరమ్మతులు చేయించడం జరిగినది. అందుకు గాను ఏ పి సి ఓ బి వారికి, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ విశాఖపట్నం చైర్మన్ శ్రీ కోన తాతారావు గారికి కొండకర్ల పి ఏ సి ఎస్ తరుపున ధన్యవాదాలు తెలియచేయడం జరిగినది.
కొండకర్ల పి ఏ సి ఎస్ ద్వారా 9.50 కోట్లు సుమారుగా వ్యాపారం జరిగినది రైతులకు పంట ఋణాలు ద్వారా 2.60 కోట్లు, భూమి తనఖా ఋణములు ద్వారా 3.06 కోట్లు, మరియు బంగారం పై ఋణములు ద్వారా ఒక 1.61 కోట్లు, మరియు సంఘ సభ్యులు నుండి స్వీకరించిన డిపాజిట్లు 2.45 కోట్లు వ్యాపారం చేయడమైనది. వీటితో పాటుగా సంఘము నందు రైతులుకు ఎరువులు పంపిణీ మరియు ధాన్యం కొనుగోలు చేయటం జరుగుతుంది.
ఈ కార్యక్రమునికి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అచ్యుతాపురం బ్రాంచ్ నోడల్ ఆఫీసర్ శ్రీ ఎమ్ వి వి కిషోర్ ఫీల్డ్ ఆఫీసర్ వి శ్రీనివాసరావు మరియు పి ఏ సి ఎస్ డైరెక్టర్లు గండి బాబూరావు, శనివాడ సత్యారావు, సి ఈ ఓ మహేశ్వరరావు, మరియు సిబ్బంది జి . విజయ్ కుమార్, ఎస్ .సాయి కిషోర్, బి .జగదీశ్వరి, మరియు సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు పాల్గొని మహాజన సభను జయప్రదం చేశారు