BREAKING
వైసీపీ పార్టీ తరఫున నెక్కుంది ఎంపిటిసి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన హేమలత! *అశ్వరావుపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం* నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహరచన ఎంపీ రఘురాం రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి, జారే ఆదినారాయణ టాలీవుడ్ స్టార్ హీరో ఉదయ్ కిరణ్ సినిమా అవకాశాలపై నటి రేఖ ఆసక్తికర వ్యాఖ్యలు నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ ట్రెండింగ్‌గా సూరి, సుహాస్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో రికార్డ్ కొడవలూరు మండల జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ప్రకటించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. టాలీవుడ్‌కు చందమామ కాజల్ అగర్వాల్ దూరం.. బాలీవుడ్ బాట పట్టిన స్టార్ హీరోయిన్ రామగోపాల్ వర్మ సంచలన చిత్రం పోలీస్ కంపెనీ విడుదల తేదీ ఖరారు.. అసలు కథ ఏమిటంటే వైసీపీలో చేరిన మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు. పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్ ఎంపీటీసీ ఎన్నికల రిజర్వేషన్ తేడాలా?* *అయోమయంలో ఎంపీటీసీ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు* టిడిపి రెబల్స్ కు ఎమ్మెల్యే గల్లా మాధవి స్ట్రాంగ్ వార్నింగ్ టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసులో సంచలన విషయాలు.. అసలు టార్గెట్ సల్మాన్ ఖానేనా?

కళ్యాణదుర్గం అభివృద్ధికి అండగా నిలవండి.… టీడీపీ అభ్యర్థి గెలుపునకు భర్త తిమ్మరాజులు, కుమారుడు హరీష్ విస్తృత ప్రచారం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నాయకత్వంలో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తాం.. అభివృద్ధే మా ప్రధాన లక్ష్యం

Select Suryaa Now
కళ్యాణదుర్గం అభివృద్ధికి అండగా నిలవండి.…  టీడీపీ అభ్యర్థి గెలుపునకు భర్త తిమ్మరాజులు, కుమారుడు హరీష్ విస్తృత ప్రచారం  ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నాయకత్వంలో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తాం..   అభివృద్ధే మా ప్రధాన లక్ష్యం

కళ్యాణదుర్గం ఇంచార్జ్, (కళ్యాణదుర్గం ఇన్చార్జ్, మేజర్ న్యూస్) : పట్టణ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడంతోపాటు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ఆమె భర్త బుట్నా తిమ్మరాజులు, కుమారుడు బుట్న హరీష్ పట్టణంలో విస్తృత ప్రచారం చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నేతృత్వంలో కళ్యాణదుర్గం పట్టణం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. ఇప్పటికే చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు మరింత తోడ్పాటు అందించేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పట్టణంలో రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర మౌలిక సదుపాయాల మెరుగుదలకు కృషి చేయాలనే సంకల్పంతో ఉన్నామని పేర్కొన్నారు.

అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం

ఎమ్మెల్యే సురేంద్రబాబు నాయకత్వంలో పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటామని, ప్రజల అవసరాలను గుర్తించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ కళ్యాణదుర్గాన్ని మరింత అభివృద్ధి చెందిన పట్టణంగా తీర్చిదిద్దేందుకు తమ వంతు బాధ్యత నిర్వహిస్తామని పేర్కొన్నారు.

పట్టణ అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, అందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని చెబుతూ టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చి గెలిపించాలని తిమ్మరాయిలు, హర్షిత్ ఓటర్లను అభ్యర్థించారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు అండగా నిలిస్తే కళ్యాణదుర్గం మరింత ప్రగతి సాధిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.