BREAKING
13 ఏళ్ల వయసులోనే బాల్య వివాహం.. నటి రాగిణి వ్యక్తిగత జీవితం వెనుక కన్నీటి గాథ! రీజనల్ సమ్మిట్ ఎగ్జిబిషన్‌ను సందర్శించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభివృద్ధి పనులు, తాగునీటి సమస్యలపై మంత్రి నారాయణతో సమావేశం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పత్తి కొనుగోళ్లకు రంగం సిద్ధం చేయాలి.... జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అంగన్వాడి సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలి......... ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మ జా మా ఊరు దారిని మేము కాపాడుకుంటాం పొదలాడ ప్రజలు రాస్త రోకో క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి ఎస్పీ జగదీష్‌ ఆదహళ్లి ఓటీటీలోనూ అదరగొడుతున్న బెత్లెహమ్ కుటుంబ యూనిట్.. ఏకంగా 5.4 మిలియన్ల వ్యూస్‌తో సరికొత్త రికార్డ్! అభివృద్ధి అవకాశాలను వెలుగులోకి తేవడమే ప్రాంతీయ సదస్సుల లక్ష్యం : రాష్ట్ర పరిశ్ర‌మ‌ల శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఎన్. యువ‌రాజ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి విశాఖను తూర్పు తీర ఆర్థిక ముఖద్వారంగా అభివృద్ధి చేస్తాం మోదీ గారి 25 ఏళ్ల పాలనా ప్రస్థానం భారత రాజకీయాల్లో నవశకం: ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్స్ పరిశీలన కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు కొత్త ఊపు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది టీచర్లే

కాలం చెల్లిన ఆంబులెన్స్ లతో రోగులకు అవస్థలు.

Select Suryaa Now
కాలం చెల్లిన ఆంబులెన్స్ లతో రోగులకు అవస్థలు.

కళ్యాణదుర్గం టౌన్ ప్రతినిధి రంగా :-

అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడాల్సిన అంబులెన్స్‌లే మార్గమధ్యలో మొరాయిస్తుండటంతో రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుందుర్పి మండల పరిధిలోని ఆపలేపల్లి గ్రామానికి చెందిన వడ్డే లక్ష్మణమూర్తి పాము కాటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే కుందుర్పి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన వైద్యం కోసం కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించాలని వైద్య సిబ్బంది సూచించారు. దీంతో అంబులెన్స్‌లో రోగిని కళ్యాణదుర్గం తరలిస్తుండగా ఆపలేపల్లి గ్రామ సమీపంలో వాహనం అకస్మాత్తుగా మార్గమధ్యలోనే నిలిచిపోయింది. అత్యవసర వైద్యం అవసరమైన రోగిని తీసుకెళ్తున్న సమయంలో అంబులెన్స్‌ చెడిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పాము కాటు ఘటనలో సమయం ఎంతో కీలకమైనప్పటికీ వాహనం ముందుకు కదలకపోవడంతో రోగి పరిస్థితిపై బంధువులు భయాందోళన వ్యక్తం చేశారు. చేసేదేమీ లేక చివరకు బాడుగ వాహనాన్ని ఏర్పాటు చేసుకుని రోగిని అందులో కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించి రోగులను సకాలంలో ఆసుపత్రులకు చేర్చాల్సిన అంబులెన్స్‌లు తరచూ సాంకేతిక సమస్యలకు గురవుతున్నాయని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత వాహనాలను నిర్వహణ పేరుతో నడిపించడం వల్ల అత్యవసర సేవలకు ఆటంకం కలుగుతోందని వారు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పాము కాటు, ప్రమాదాలు, గర్భిణుల తరలింపు, గుండె సంబంధిత అత్యవసర పరిస్థితులు, ఇతర ప్రాణాపాయ సందర్భాల్లో ఒక్కో నిమిషం కూడా ఎంతో విలువైనదని, ఇలాంటి సమయంలో అంబులెన్స్‌ మార్గమధ్యలో నిలిచిపోతే రోగుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుందుర్పి మండలంలోని గ్రామీణ ప్రాంతాలకు అంబులెన్స్‌ సేవలు అత్యంత అవసరమైనప్పటికీ, అందుబాటులో ఉన్న వాహనాల పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అంబులెన్స్‌లకు క్రమం తప్పకుండా సర్వీసింగ్‌, సాంకేతిక తనిఖీలు నిర్వహించాలని, అత్యవసర సమయంలో వాహనాలు మొరాయించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అవసరమైతే కాలం చెల్లిన పాత అంబులెన్స్‌లను తొలగించి వాటి స్థానంలో కొత్త, మెరుగైన వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని మండల ప్రజలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. కుందుర్పి మండలంలోని అన్ని గ్రామాలకు అత్యవసర సమయాల్లో నిరంతర అంబులెన్స్‌ సేవలు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.