జెడ్పీటీసీ నామినేషన్ కేంద్రం వద్ద పటిష్ట భద్రత
శ్రీకాకుళం, సూర్య : శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న జెడ్పీటీసీ నామినేషన్ ప్రక్రియలో భాగంగా మూడవ రోజు నామినేషన్ కేంద్రాన్ని శుక్రవారం ఉదయం జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.నామినేషన్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు 30 యాక్ట్, సెక్షన్ 144 అమలుతో పాటు జనసమూహాల నియంత్రణ, వాహనాల రాకపోకల క్రమబద్ధీకరణ, అవసరమైన చోట ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. నామినేషన్ కేంద్రం పరిసరాల్లో అనవసరంగా గుమిగూడకుండా చర్యలు తీసుకుంటూ, అభ్యర్థులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ తెలిపారు.
భద్రతా చర్యల్లో భాగంగా డ్రోన్ కెమెరాల ద్వారా పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తూ, సీసీ కెమెరాలు ద్వారా పరిస్థితులను నిరంతరం గమనిస్తున్నారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేలా చూడాలని ఎస్పీ సూచించారు.ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖకు సహకరించాలన్నారు.
రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.