జనసేన పార్టీ శాంతిపురం జడ్పిటిసి అభ్యర్థి గా రామమూర్తి
శాంతిపురం మేజర్ న్యూస్జ;నసేన పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు శాంతిపురం జడ్పిటిసి స్థానానికి పోటీ చేసేందుకు జనసేన పార్టీ జిల్లా నాయకులు నల్లప్పరెడ్డియూరు కు చెందిన రామమూర్తి కె. దరఖాస్తు సమర్పించారు. పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు.పార్టీ అధిష్ఠానం నుంచి అధికారిక ఆదేశాలు అందిన వెంటనే, గురువారం లేదా శుక్రవారం కూటమి తరఫున శాంతిపురం జడ్పిటిసి స్థానానికి నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.జనసేన పార్టీ సిద్ధాంతాలపై నమ్మకంతో, ప్రజాసేవను ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని రామమూర్తి కె. తెలిపారు. ప్రజల ఆశీస్సులు, అభిమానమే తనకు కొండంత బలమని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని, అధిష్ఠానం నిర్ణయమే తనకు శిరోధార్యమని స్పష్టం చేశారు.పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకే నామినేషన్ ప్రక్రియను చేపడతానని, జనసైనికులు, కూటమి శ్రేణులు, శాంతిపురం ప్రజల ఆశీస్సులు, మద్దతు తనకు అందించాలని ఈ సందర్భంగా కోరారు.